పలువురిని సన్మానించిన
మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
న్యూస్‌తెలుగు/వనపర్తి : ఇటీవల రిటైర్డ్ అయిన వెంకట్ రెడ్డి ఉపాధ్యాయ దంపతులను, రవికుమార్ దంపతులు మరియు ఆర్.టి.సి లో పదవి విరమణ చేసిన గుడ్డారెడ్డి దంపతులను మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సన్మానించడం జరిగింది. అచ్యుతాపురం గ్రామానికి చెందిన రిటైర్డు A.S.I శాంతన్న కి రోడ్డు ప్రమాదం జరిగింది ఇట్టి విషయం తెలుసుకున్న మాజీ మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి వారి ఇంటికి వెళ్లి ఆరోగ్య యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు . ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గట్టి యాదవ్ నాయకులు ప్రేమ్ నాథ్ రెడ్డి ,కో ఆప్షన్ ఇమ్రాన్ యుగంధర్ రెడ్డి ,చిట్యాల రాము, నందిమల్ల సుబ్బు, వంశి ,హలీం ,వంశి,నాగరాజు ,రవి ,రాహుల్ ,ఆశన్న నాయుడు ,విష్ణు, తదితరులు పాల్గొన్నారు. (Story : పలువురిని సన్మానించిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి)