UA-35385725-1 UA-35385725-1

‘గేమ్ ఛేంజర్’ నుంచి లుక్ పోస్టర్ విడుదల

‘గేమ్ ఛేంజర్’ నుంచి లుక్ పోస్టర్ విడుదల

న్యూస్‌తెలుగు/ హైద‌రాబాద్ సినిమా : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. ఈ మూవీ మీద ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్  నిర్మిస్తోన్న ఈ సినిమాలో కియారా అద్వాని హీరోయిన్‌గా నటిస్తున్నారు.  ఇప్పటికే వదిలిన పోస్టర్స్, ‘జరగండి జరగండి..’ సాంగ్‌, వస్తోన్న అప్డేట్లతో  గేమ్ ఛేంజ‌ర్‌పై మరింత హైప్ ఏర్పడింది. క్రిస్మ‌స్ సంద‌ర్భంగా భారీ బ‌డ్జెట్ పాన్ ఇండియా చిత్రాన్ని వ‌ర‌ల్డ్ వైడ్‌గా రిలీజ్ చేస్తున్నారు.
తాజాగా జూలై 31న కియారా అద్వానీ పుట్టిన‌రోజు ఈ సంద‌ర్భంగా గేమ్ ఛేంజ‌ర్ నుంచి ఆమె లుక్ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు మేక‌ర్స్‌. చూపు తిప్పుకోవ‌టం క‌ష్టం అనేంతంగా కియారా గ్లామ‌ర్ లుక్ అభిమానులు, సినీ ప్రేక్ష‌కుల‌ను క‌ట్టి ప‌డేస్తోంది. విన‌య విధేయ రామ చిత్రంలో జోడీగా మెప్పించిన రామ్ చ‌ర‌ణ్‌, కియారా అద్వానీ.. గేమ్ ఛేంజ‌ర్‌లో అల‌రించ‌టానికి రెడీ అయ్యారు. ఈ క్యూట్ పెయిర్ సంద‌డిని సిల్వ‌ర్ స్క్రీన్‌పై చూడాల‌నే ఉత్సాహం అంద‌రిలోనూ క‌నిపిస్తోంది.

రీసెంట్‌గానే గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ త‌న పాత్ర‌కు సంబంధించిన చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసేశారు. డైరెక్టర్ శంకర్ మిగిలిన చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. లార్జ‌ర్ దేన్ లైఫ్ చిత్రాల‌ను అబ్బుర‌ప‌రిచే రీతిలో తెర‌కెక్కించే శంకర్ ఇప్ప‌టి వ‌ర‌కు తెర‌కెక్కించిన సినిమాల‌ను మించేలా ‘గేమ్ ఛేంజ‌ర్‌’ను రూపొందిస్తున్నారు.గేమ్ చేంజర్ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీత సారథ్యం వహిస్తున్నారు. ప్రముఖ ఆడియో కంపెనీ సారేగమ ఈ సినిమా ఆడియో రైట్స్‌ను ఫ్యాన్స్ ప్రైజ్‌కి దక్కించుకుంది.

న‌టీ న‌టులు:
రామ్ చ‌ర‌ణ్‌, కియారా అద్వానీ, అంజ‌లి, సముద్ర‌ఖ‌ని, ఎస్‌.జె.సూర్య‌, శ్రీకాంత్‌, సునీల్‌, న‌వీన్ చంద్ర త‌దిత‌రులు (Story : ‘గేమ్ ఛేంజర్’ నుంచి లుక్ పోస్టర్ విడుదల)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1