అన్నా క్యాంటీన్లను పరిశీలించిన కమిషనర్
ఎం ఎం నాయుడు
న్యూస్‌తెలుగు/విజయనగరం : ఆగస్టు 15వ తేదీన ప్రారంభించనున్న అన్నా క్యాంటీన్ల ఏర్పాటుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని నగరపాలక సంస్థ కమిషనర్ ఎంఎం నాయుడు తెలిపారు. అన్నాక్యాంటీన్ల ఏర్పాట్లను బుధవారం ఆయన పరిశీలించారు. డిఈలు,ఏఈలతో కలిసి అన్నా క్యాంటీన్లను పరిశీలించిన ఆయన కొన్ని సూచనలను చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు సన్నద్ధమైన అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణకు అవసరమైన చర్యలు చేపట్టామన్నారు. ఆగస్టు 15 నాటికి అన్ని వసతులతో సౌకర్యవంతమైన అన్నా క్యాంటీన్లను సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. నగరంలోని రెండు చోట్ల అన్నా క్యాంటిన్ లను పునః ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఆర్టీసీ కాంప్లెక్స్ ప్రాంతంలో ఒకటి,నగరపాలక సంస్థ కార్యాలయ సమీపంలో మరొకటి అన్నా క్యాంటీన్లను పునరుద్ధరించనున్నట్లు తెలిపారు. రుచికరమైన ఆహారంతో పాటు అవసరమైన సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. (Story : అన్నా క్యాంటీన్లను పరిశీలించిన కమిషనర్)