UA-35385725-1 UA-35385725-1

హైదరాబాద్‌లో భారీగా నకిలీ పురుగుమందుల స్వాధీనం

హైదరాబాద్‌లో భారీగా నకిలీ పురుగుమందుల స్వాధీనం

న్యూస్‌తెలుగు/హైదరాబాద్‌: వ్యవసాయ రంగంపై ప్రభావం చూపుతున్న నకిలీ పురుగుమందుల విక్రేతల ఆటకట్టిసూ పోలీసులు జరిపిన దాడులలో పేరొందిన కంపెనీల ఉత్పత్తులు బయటపడ్డాయి. మోసపూరిత కార్యకలాపాలను అణిచివేసే ప్రక్రియలో భాగంగా హైదరాబాద్‌లో ఇటీవల జరిపిన దాడిలో ఎనిమిది బహుళజాతి సంస్థలు (%వీచీజ%లు) మరియు ప్రఖ్యాత భారతీయ కంపెనీలైనటువంటి ధనుక, సింజెంటా, ఎఫ్‌ఎంసి, కోర్టవా, ర్యాలీస్‌, ఇండోఫిల్‌, పై, బేయర్‌ వంటి సంస్థల నకిలీ ఉత్పత్తులు ఉన్నట్లు వెల్లడైంది. నకిలీ వ్యవసాయ ఉత్పత్తులను సరఫరా చేయడానికి పెద్దఎత్తున ఏర్పడ్డ ముఠాలపై కొనసాగుతున్న దర్యాప్తులో భాగంగా ఈ దాడి జరిగింది. ఈ నకిలీ వస్తువులు పంటల నాణ్యతను దెబ్బతీయడమే కాకుండా దేశవ్యాప్తంగా రైతుల జీవనోపాధికి ముప్పు తెస్తాయి. వ్యవసాయం, వినియోగదారుల రక్షణ, జాతీయ ప్రయోజనాలపై ఈ నకిలీ పురుగుమందులు చూపే ప్రభావం పరిగణలోకి తీసుకుంటే ఈ ఆపరేషన్‌ స్థాయి ఆందోళనకరంగా ఉంది. (Story : హైదరాబాద్‌లో భారీగా నకిలీ పురుగుమందుల స్వాధీనం)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
UA-35385725-1