Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ ఉచితంగా నోటు పుస్తకాలు అందజేయడం సంతోషం

ఉచితంగా నోటు పుస్తకాలు అందజేయడం సంతోషం

0

ఉచితంగా నోటు పుస్తకాలు అందజేయడం సంతోషం

కలెక్టర్ నారాయణ రెడ్డి

న్యూస్ తెలుగు/నల్లగొండ : భారత సేవాశ్రమ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం నల్గొండ మండలంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా నోటు పుస్తకాలు పంపిణీ చేసేందుకు ఉద్దేశించి నల్గొండ మండలం కతాల్ గూడ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటుచేసిన ఉచిత నోటు పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసించే పేద విద్యార్థులకు భారత సేవాశ్రమ సంఘం ఉచిత నోట్ పుస్తకాలను పంపిణీ చేయటం సంతోషకరమని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు. భారత సేవాశ్రమ సంఘం దేశవ్యాప్తంగా అనేక సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నదని, ఇందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు పేద విద్యార్థులు ఉంటారని గుర్తించి వారికి ఉచితంగా నోటు పుస్తకాలు అందజేయడం సంతోషకరమని కలెక్టర్ అన్నారు. ఉచిత నోటు పుస్తకాల పంపిణీకి నల్గొండ జిల్లాను ఎంపిక చేసుకోవడం సంతోషమని అన్నారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారి భిక్షపతి,భారత సేవాశ్ త‌దిత‌రులు పాల్గన్నారు. (Story : ఉచితంగా నోటు పుస్తకాలు అందజేయడం సంతోషం)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version