ఉపాధి అవకాశాలు పెంచే కేంద్ర బడ్జెట్
న్యూస్‌తెలుగు/న్యూదిల్లీ: మోడీ 3.0 ప్రభుత్వంలో 2024 కేంద్ర బడ్జెట్‌పై నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) ఎండి, సీఈఓ ఆశిష్‌కుమార్ చౌహాన్ తన స్పందన తెలియజేస్తూ.. ఈ బడ్జెట్, ప్రభుత్వ రంగంతో పాటు ఉద్యోగాల కల్పనలో ప్రైవేట్ రంగం కూడా పాలుపంచుకునేలా చేయడం ద్వారా భారతదేశంలో ఉద్యోగాల కల్పనకు భారీ పూచీకత్తును అందించారని అభిప్రాయపడ్డారు. అదే సమయంలో భారతదేశం నంబర్ 1 స్టార్టప్ నేషన్‌గా, పారిశ్రామికవేత్తల దేశంగా అవతరించేలా ఏంజెల్ ట్యాక్స్‌పై మినహాయింపు అలాగే ముద్ర లోన్ స్కీమ్ పరిమితిని ఒక్కో వ్యక్తికి రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచడం ద్వారా భరోసా ఇచ్చారు. వర్క్‌ఫోర్స్‌లో మహిళల భాగస్వామ్యాన్ని మరింతగా పెంచేందుకు, భారతదేశం మరింత జనాభా డివిడెండ్‌ను పొందడంలో సహాయపడేందుకు భారతదేశ కార్మిక శక్తిలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడంపై కూడా ఆమె దృష్టి సారించారన్నారు. (Story : ఉపాధి అవకాశాలు పెంచే కేంద్ర బడ్జెట్)