నీరు నిల్వ లేకుండా జాగ్రత్త వహించాలి
నగరపాలక సంస్థ కమిషనర్ ఎంఎం నాయుడు
న్యూస్‌తెలుగు/ విజయనగరం : నగరంలోని వివిధ ప్రాంతాలలో పర్యటించిన నగరపాలక సంస్థ కమిషనర్ ఎంఎం నాయుడు ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించారు. దాసన్నపేట, అశోక్ నగర్ లోనూ, కంటోన్మెంట్,బొగ్గుల దిబ్బ తదితర ప్రాంతాల్లో పర్యటించి పారిశుధ్యపరంగా నిర్వహిస్తున్న పనులను పరిశీలించారు.ఎక్కడా నీరు నిల్వ లేకుండా జాగ్రత్త వహించాలని సిబ్బందికి ఆదేశించారు. అలాగే చుట్టుపక్కల ఉన్న వ్యాపారస్తులకు, ప్రజలకు అవగాహన కల్పించారు. నీరు నిల్వ ఉండడం వల్ల దోమలు వృద్ది కేంద్రాలుగా తయారవుతాయని దీనివల్ల అంటురోగాలు ప్రబలే అవకాశం ఉంటుందని చెప్పారు. కాలువల్లో పూడికలను ఎప్పటికప్పుడు తొలగించాలని సిబ్బందికి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పారిశుధ్య పర్యవేక్షకులు సాలెం రాజు తదితరులు పాల్గొన్నారు. (Story : నీరు నిల్వ లేకుండా జాగ్రత్త వహించాలి)