Home సినిమా ఓటీటీ ది లార్డ్‌ ఆఫ్‌ ది రింగ్స్‌: ది రింగ్స్‌ ఆఫ్‌ పవర్‌ రెండో సీజన్‌ ట్రైలర్‌...

ది లార్డ్‌ ఆఫ్‌ ది రింగ్స్‌: ది రింగ్స్‌ ఆఫ్‌ పవర్‌ రెండో సీజన్‌ ట్రైలర్‌ అదుర్స్‌!

0

ది లార్డ్‌ ఆఫ్‌ ది రింగ్స్‌: ది రింగ్స్‌ ఆఫ్‌ పవర్‌ రెండో సీజన్‌ ట్రైలర్‌ అదుర్స్‌!

ముంబై: ఐతిహాసిక సీరీస్‌ దిలార్డ్‌ ఆఫ్‌ ది రింగ్స్‌: ది రింగ్స్‌ ఆఫ్‌ పవర్‌ ఎంతగానో ఎదురుచూడబడుతున్న రెండవసీజన్‌ను అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ప్రదర్శించిన వేళ శాన్‌డియాగో శుక్రవారం నాడు మిడిల్‌-ఎర్త్‌గా మారింది. షో నిర్వాహకులు జే.డి. పేనే, పాట్రిక్‌ మాక్‌మే ఐకానిక్‌ హాల్‌ హెచ్‌ వేదికపై ఎమ్మి-నామినేటెడ్‌ నటి యెట్టె నికోలె బ్రౌన్‌(అవెంజర్స్‌: ఎండ్‌గేమ్‌, కమ్యూనిటి) ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ తారాగణం రాబోయే సీజన్‌ కొరకు ఒక కొత్త, ప్రత్యేకమైన ట్రెయిలర్‌ విడుదల చేయడం ద్వారా భారీ కన్వెన్షన్‌ సెంటర్‌ హాల్లో నిండి ఉన్న 6,500 ఫ్యాన్స్‌కు వినోదాన్ని అందించారు. ఈ యాక్షన్‌-ప్యాక్డ్‌ ట్రెయిలర్‌ ఎంతో భయపడిన లెజెండరీ విలన్‌ సౌరాన్‌ తిరిగి ఆవిర్భవించడం గురించి దృష్టి కేంద్రీకరిస్తుంది. తద్వారా తన రాజ్యాల మధ్య సుదీర్ఘ పోరాటం తరువాత లభించిన శాంతి తరువాత మిడిల్‌-ఎర్త్‌కు చీకటి, చెడు తిరిగి వస్తున్నాయని ప్రకటించింది. ఈ ట్రెయిలర్‌ సౌరాన్‌ మోం, కుట్రల శక్తుల సహాయంతో టైట్యులార్‌ రింగ్స్‌ ఆఫ్‌ పవర్‌ సృష్టిని ప్రాధాన్యీకరించింది.

షో హాల్ హెచ్ ప్యానెల్ లో పాల్గొన్న తారాగణ సభ్యులు సింథియా అడ్డై-రాబిన్సన్, రాబర్ట్ అరమాయో, మాక్సిం బాల్డ్రి,
మోర్ఫైడ్ క్లార్క్, ఇస్మాయెల్ క్రూజ్ కార్డోవ, చార్లెస్ ఎడ్వర్డ్స్, ట్రైస్టాన్ గ్రావెల్లె, శాం హజెల్డైన్, ఎమ హోర్వత్, టైరో
ముహాఫిడిన్, సోఫియా నోంవెటె, లాయడ్ ఓవెన్, మెగాన్ రిచర్డ్స్, చార్లీ వికర్స్, బెంజామిన్ వాకర్ మరియు డేనియల్
వేమాన్.
ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్ యొక్క రెండవ సీజన్ ప్రైమ్ వీడియో పై ప్రత్యేక ప్రీమియర్ గా ఆగస్ట్ 29,
2024 నుండి ప్రసారం అవుతుంది. (Story: ది లార్డ్‌ ఆఫ్‌ ది రింగ్స్‌: ది రింగ్స్‌ ఆఫ్‌ పవర్‌ రెండో సీజన్‌ ట్రైలర్‌ అదుర్స్‌!)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version