ఎత్తిపోతల కోసం సారధి ప్రత్యేక శ్రద్ధ!
మోరంపూడి
న్యూస్ తెలుగు/చాట్రాయి : చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభం కోసం మంత్రి సారధి చూపుతున్న ప్రత్యేక శ్రద్ధ మరువలేనిదని తెలుగు రైతు ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి మోరంపూడి శ్రీనివాస రావు కొనియాడారు. ఆదివారం అయన న్యూస్ తెలుగు తో మాట్లాడుతూ. ఏలూరు జిల్లా, ఎన్టీఆర్ జిల్లాలోని మెట్ట ప్రాంతానికి వరప్రదాయని అయిన చింతలపూడి ఎత్తిపోతల పథకం పేజ్ టూ ను పేజ్ వన్ ను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిస్థాయిలో నిర్లక్ష్యం చేసిందని గుర్తు చేశారు. అటువంటి పథకానికి మరల జీవం పోయడం కోసం స్థానిక నూజివీడు శాసనసభ్యులైనా మంత్రి కొలుసు పార్థసారథి వ్యక్తిగత బాధ్యత తీసుకొని నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. నిన్న వేలూరుపాడు వెళుతూ మార్గమధ్యలో చనుబండలో మంత్రులు ఆగిన సందర్భంలో సీనియర్ నాయకులైన మంత్రి అచ్చం నాయుడు దృష్టికి చింతలపూడి ఎత్తిపోతల పథకం పేస్టు యొక్క ప్రాధాన్యతను వివరించారని తెలిపారు. నూజివీడు నియోజకవర్గంలోని భౌగోళిక పరిస్థితులు ప్రజల యొక్క జీవన విధానం ఆదాయ వనరులు సారవంతమైన భూములు గురించి ప్రత్యేకమైన అవగాహన కలిగి ఉన్నారన్నారు. నియోజకవర్గంలోని యువతకు ఉపాధి అవకాశాలు పెంచేదానిపై ప్రత్యేకమైన కృషి చేస్తున్నారని అన్నారు. దళిత గిరిజన బడుగు బలహీన వర్గాల యొక్క ఆర్థిక స్వావలంభన తీసుకురావడం కోసం ప్రణాళిక బద్ధంగా పనిచేస్తున్నారని కొనియాడారు. (Story: ఎత్తిపోతల కోసం సారధి ప్రత్యేక శ్రద్ధ!)