Homeవార్తలుతెలంగాణమానవత్వం చాటుకున్న చింతనమానపల్లి ఎస్సై నరేష్

మానవత్వం చాటుకున్న చింతనమానపల్లి ఎస్సై నరేష్

మానవత్వం చాటుకున్న చింతనమానపల్లి ఎస్సై నరేష్

కొమురం భీం ఆసిఫాబాద్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానపల్లి మండలంలోని డిందా గ్రామానికి వెళ్లే రహదారికి మధ్యలో బ్రిడ్జిపై నుంచి వరద నీరు ఉద్ధృతంగా ప్రవహించడంతో గ్రామ ప్రజలు బయటికి రాలేని పరిస్థితి నెలకొంది. సమాచారం తెలుసుకున్న చింతలమానపల్లి ఎస్సై నరేష్ గ్రామ ప్రజలకు సుమారు రెండు క్వింటాళ్ల కూరగాయలను పంపిణీ చేశారు. గ్రామ ప్రజలు ఎవరు కూడా వరద ఉధృతి తగ్గేవరకు బ్రిడ్జి దాటే ప్రయత్నం చేయవద్దని, అత్యవసర పరిస్థితి ఏర్పడితే పోలీసులను సంప్రదించాలని తెలియజేశారు. మాన‌వ‌త్వం చాటుకున్న ఎస్ఐ న‌రేష్‌ను ప్ర‌జ‌లు ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు. (Story: మానవత్వం చాటుకున్న చింతనమానపల్లి ఎస్సై నరేష్)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!