కార్మిక హక్కుల పరిరక్షణకు పోరాటాలు
👉నాలుగు లేబర్ కోడ్ లకు వ్యతిరేకంగా కార్మిక లోకం గళంఎత్తాలి.
👉ప్రభుత్వరంగ సంస్థలను బిజెపి కుట్రల నుండి కాపాడుకుందాం.
👉8 గంటల పని హక్కు సాధించింది ఏఐటీయూసీనే–ఏఐటీయూసీ జిల్లా గౌరవ అధ్యక్షులు SK సాబీర్ పాషా.
👉ఘనంగా ఏఐటీయూసీ పాల్వంచ పట్టణ 2వ మహాసభ
న్యూస్‌తెలుగు/పాల్వంచ: కార్మిక వర్గ హక్కుల పరిరక్షణ కోసం సంఘటిత అసంఘటిత కార్మిక లోకం పోరాటాలకు సిద్ధం కావాలని ఏఐటీయూసీ జిల్లా గౌరవ అధ్యక్షులు, సీపీఐ జిల్లా కార్యదర్శి SK సాబీర్ పాషా పిలుపునిచ్చారు. శనివారం స్థానిక చండ్ర రాజేశ్వరరావు భవన్ లో ఏఐటీయూసీ పాల్వంచ పట్టణ 2వ మహాసభ నిర్వహించారు. తొలుత రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్యాల విశ్వనాథం అరుణ పతకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో సాబీర్ పాషా మాట్లాడుతూ కొట్లాడి సాధించిన 44 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోల్డ్ గా మార్చాలని కుట్రను కేంద్రంలోని మోడీ ప్రభుత్వం చేస్తుంది అని, ప్రభుత్వ రంగ సంస్థలను తెగనమ్మి ఆదా నీ అంబానీలకు అప్పజెప్పేందుకు తీవ్ర కృషి చేస్తుందని విమర్శించారు. సంఘటిత, అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న శ్రామిక జీవులకు ఏఐటీయూసీ దిక్చూచి వంటిదని, కార్మికులకు ఏ కష్టం వచ్చినా బాసటగా నిలిచే సంఘం ఏఐటీయూసీ అని, కార్మికులు, ఉద్యోగుల హక్కులు, సౌకర్యాలకు స్వాతంత్రానికి పూర్వం నుంచే పోరాడుతోందని, 8 గంటల పనివిధానం, సంక్షేమ చట్టాలను సాధించి పెటింది ఏఐటీయూసీనేనని అన్నారు. ఎన్నో పోరాటాలు, ప్రాణత్యాగాలతో సాధించుకున్న చట్టాలని ప్రస్తుత మోడీ ప్రభుత్వం నిర్వీర్యం చేసే కుంట్రలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఈ పరిస్థితిలో ఏఐటీయూసీ నాయకత్వంలో పాలకుల ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు.
అనంతరం ఏఐటీయూసీ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కంచర్ల జమలయ్య నరటి ప్రసాద్ మాట్లాడుతూ కార్మిక వర్గానికి అనేక హామీలు గుప్పించిన అధికారంలోకి వచ్చినా కేంద్రంలోని బిజెపి సర్కార్ అధికారం చేపట్టిన తరవాత అనేక పోరాటాలుతో సాధించిన కార్మిక చట్టాలను సవరించి యాజమాన్యాలకు, కార్పొరేట్ సంస్థలకు, పెట్టుబడిదారులకు అనుకూలంగా మార్చేందుకు కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఈ కుట్రలను కార్మిక వర్గం ఉద్యమాలతోనే తిప్పికొట్టి సంక్షేమ చట్టాలను పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. నేటి పాలకులు కనీస వేతన చట్టం, పారిశ్రామిక చట్టాలను సవరణ చేయడంతోపాటు సంస్కరణలు పేరుతో ఉద్యోగులను, కార్మికులను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారని, ప్రభుత్వాల దుశ్చర్యలను కార్మికువర్గ పోరాటంతో ఎదిరించి హక్కులను కాపాడుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు బండి నాగేశ్వరరావు, సీపీఐ పట్టణ కార్యదర్శి అడుసుమల్లి సాయిబాబు, మండలం కార్యదర్శి వీసంశెట్టి పూర్ణచంద్రరావు, జిల్లా సమితి సభ్యులు వి పద్మజ, భూక్య శ్రీను, ఏఐటీయూసీ నాయకులు అన్నారపు వెంకటేశ్వర్లు, వీసంశెట్టి విశ్వేశ్వరరావు, పోగుల కోటేశ్వరరావు, ఎండ్ యూసుఫ్, సత్తెనపల్లి విజయలక్ష్మి, నరహరి నాగేశ్వరరావు, శెట్టి చేరాలు, అల్లికాంతయ్య, కోరే కృష్ణ, వై వెంకట్రామయ్య, కాసర్ల రామారావు, రాజేష్ బాబు, రామారావు, పొదిలి మంగా, ఎస్ ఏ. రెహమాన్, గౌస్, ఇట్టి వెంకట్రావు, కుర్రు రమేష్, మడుపు ఉపేంద్ర చారి, సత్యనారాయణ, వైయస్ గిరి, భూక్య విజయ్, వేముల శేఖర్, జకరయ్య, sk లాల్ పాషా తదితరులు పాల్గొన్నారు.(Story: కార్మిక హక్కుల పరిరక్షణకు పోరాటాలు)