మహాలక్ష్మి అమ్మవారి బోనాలు
పల్నాడు జిల్లా, వినుకొండ : స్థానిక ముళ్లమూరు డౌన్ లో ఉన్న మహాలక్ష్మి అమ్మవారి కి 14,13 జంట వార్డుల మహిళలు పెద్ద సంఖ్యలో ఆషాడ మసన్ని పురస్కరించుకుని పట్టణ పురవీధుల నందు బోనాలు ఊరేగింపు నిర్వహించి, అమ్మవారికి సమర్పించారు. కోరిన కిరికలు తీర్చే కొంగు బంగారం మహాలక్ష్మి అమ్మవారు కి ప్రతి ఏటా పొగ్గలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని,అందులో భాగంగా ఆషాడ మాసం కావడంతో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలతో పాటుగా మహిళలు బోనాలు సమర్పిచారని కమిటీ పెద్దలు సుంకర శ్రీనివాసరావు తెలిపారు. అడపాల రాములు ,సోము, కోటేశ్వరరావు, బత్తుల. శ్రీనివాసరావు, మహిళా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో మహిళా భక్తులు మాధవి, భవాని, బుజ్జి ,స్వాతి, గాయత్రి ఆదిలక్ష్మి భూదేవి భ్రమరా, దుర్గా, లక్ష్మీ, శ్రావణి, అంజమ్మ, తమ్మిశెట్టి. ఈశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు. (Story : మహాలక్ష్మి అమ్మవారి బోనాలు)