Home వ్యాపారం 7`12 తరగతి విద్యార్థులకు 100% వరకు ఆకాష్‌ స్కాలర్‌షిప్‌లు

7`12 తరగతి విద్యార్థులకు 100% వరకు ఆకాష్‌ స్కాలర్‌షిప్‌లు

0

7`12 తరగతి విద్యార్థులకు 100% వరకు ఆకాష్‌ స్కాలర్‌షిప్‌లు

న్యూస్‌తెలుగు/ హైదరాబాద్‌: తమ ప్రతిష్టాత్మక స్కాలర్‌షిప్‌ పరీక్ష అంథే (ఏఎన్‌టీహెచ్‌ఈ) ప్రారంభించి 15 అద్భుతమైన సంవత్సరాలు పూర్తి చేసుకోవటంను గుర్తుచేసుకుంటూ, టెస్ట్‌ ప్రిపరేటరీ సర్వీసెస్‌లో జాతీయ అగ్రగామి అయిన ఆకాష్‌ ఎడ్యుకేషనల్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (ఏఈఎస్‌ఎల్‌), విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆకాష్‌ నేషనల్‌ టాలెంట్‌ హంట్‌ ఎగ్జామ్‌ (ఏఎన్‌టీహెచ్‌ఈ) 2024 తాజా ఎడిషన్‌ను ప్రారంభించినట్లు వెల్లడిరచింది. అపూర్వ ఆదరణ పొందిన, అత్యధికంగా కోరుకుంటున్న పరీక్షల ద్వారా 7`12వ తరగతి విద్యార్థులకు 100% స్కాలర్‌షిప్‌లతో పాటు గణనీయమైన మొత్తంలో నగదు అవార్డులను సైతం గెలుచుకునే అవకాశం అందించటం ద్వారా మెడిసిన్‌ లేదా ఇంజినీరింగ్‌లో విజయవంతమైన కెరీర్‌ గురించి కలలను కనే విద్యార్థులకు తమ కల సాకారం చేసుకునే అవకాశం అందిస్తుంది. ఈ సంవత్సరం, ఉత్తేజకరమైన జోడిరపు ను అందిస్తూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఐదుగురు అత్యుత్తమ విద్యార్థుల కోసం యుఎస్‌ఏ లోని ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్‌ సెంటర్‌కు 5-రోజుల అన్ని ఖర్చులు-చెల్లింపుతో కూడిన పర్యటనను అందిస్తున్నారు. ఫ్లోరిడాలో ఉన్న జాన్‌ ఎఫ్‌. కెన్నెడీ స్పేస్‌ సెంటర్‌, యునైటెడ్‌ స్టేట్స్‌లోని నేషనల్‌ ఏరోనాటిక్స్‌ అండ్‌ స్పేస్‌ అడ్మినిస్ట్రేషన్‌ (నాసా ) యొక్క పది క్షేత్ర కేంద్రాలలో ఒకటి. (Story : 7`12 తరగతి విద్యార్థులకు 100% వరకు ఆకాష్‌ స్కాలర్‌షిప్‌లు)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version