కడపలో మహీంద్రా ట్రక్స్ అండ్ బస్ కొత్త డీలర్‌షిప్
న్యూస్‌తెలుగు/కడప: సీఏజీఆర్ ప్రాతిపదికన 2024 ఆర్థిక సంవత్సరంలో 46 శాతం వ్యాపార పరిమాణం పెరుగుదలతో నాలుగేళ్ల పటిష్ట వృద్ధి సాధించిన మహీంద్రా ట్రక్ అండ్ బస్ డివిజన్ (ఎంటీబీడీ) ఆంధ్రప్రదేశ్‌లోని కడపలో నవత ఆటోమోటివ్స్ పేరిట కొత్తగా అధునాతన డీలర్‌షిప్‌ను ప్రారంభించిందనీ సంస్థ ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు. భారతీయ సీవీ మార్కెట్లో ఎంటీబీడీకి పటిష్టమైన కార్యకలాపాలు ఉన్నాయన్నారు. సంస్థ ఇప్పటికే పలు రంగాలు, మార్కెట్లలో 3వ స్థానంలో ఉందనీ, మా నెట్‌వర్క్‌కు కొత్తగా ఈ 5 డీలర్‌షిప్‌లు తోడు కావడమనేది మా నెట్‌వర్క్‌ను మరింత పెంచగలదన్నారు. మా విలువైన కస్టమర్లకు వినూత్నమైన, సమర్ధమంతమైన రవాణా సొల్యూషన్స్‌ను అందించడంపై మరింతగా దృష్టి పెడుతున్నాం’’ అని మహీంద్రా %డ% మహీంద్రా బిజినెస్ హెడ్ (కమర్షియల్ వెహికల్స్) జలజ్ గుప్తా తెలిపారు. (Story : కడపలో మహీంద్రా ట్రక్స్ అండ్ బస్ కొత్త డీలర్‌షిప్)