Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌  మహిళాభ్యున్నతి లక్ష్యంగా వికసిత్ భారత్ బడ్జెట్

 మహిళాభ్యున్నతి లక్ష్యంగా వికసిత్ భారత్ బడ్జెట్

0

మహిళాభ్యున్నతి లక్ష్యంగా వికసిత్ భారత్ బడ్జెట్

మహిళా మోర్చా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు డా. మేకల శిల్పారెడ్డి

న్యూస్‌తెలుగు/వనపర్తి : వికసిత భారత్ లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా బిజెపి జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు డి నారాయణ నేతృత్వంలో పట్టణ అధ్యక్షులు బచ్చు రాము అధ్యక్షతన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మహిళా మోర్చా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు డా.మేకల శిల్పారెడ్డి హాజరయ్యారు. సందర్భంగా మేకల శిల్పారెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో చారిత్రాత్మకంగా వరుసగా మూడవ పర్యాయం అధికారంలోకి వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మల సీతారామన్ గారు పేదలు రైతులు యువత మహిళా మహిళాభ్యున్నతి.. వికసితభారత్ లక్ష్యంగా48.20 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టారని యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు మెరుగుపరుచుకునేటందుకు రెండు లక్షల కోట్లతో MSME రంగానికి ప్రోత్సాహకాలు ప్రకటించి లక్షలాదిమందికి ఉద్యోగ కల్పన సాధించేందుకు బాటలు వేశారన్నారు.ప్రప్రథమంగా గ్రామీణాభివృద్ధికి
2.66 లక్షల కోట్లతో గ్రామాల అభివృద్ధికి మహర్దశ ఏర్పడనుందని ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా గ్రామాలు పట్టణాలలో 10 లక్షల కోట్లతో మూడు కోట్ల ఇళ్ల నిర్మాణం ముద్రా రుణ పరిమితిన పది లక్షల నుంచి 20 లక్షలకు పెంపు మహిళలపై రిజిస్ట్రేషన్ చేస్తే స్టాంప్ డ్యూటీ తగ్గింపు ఐదు ఏళ్లలో ఐదు పథకాల కింద 4.1 కోట్ల యువతకు లబ్ధి 20 లక్షల మంది యువతకు శిక్షణ కోటి మందికి ఇంటర్నషిప్ షిప్ విద్యుత్ ప్లాంట్లు వైద్య కాలేజీలు జాతీయ రహదారులు రైల్వే శాఖకు రక్షణ రంగానికి గతంలో ఎన్నడూ లేనంతగా వికసితభారత్ లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 3.0 బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగిందని రాబోయే మూడేళ్లలో భారతదేశం ఆర్థిక అభివృద్ధిలో మూడవ స్థానానికి చేరుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అయ్యగారి ప్రభాకర్ రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ రామన్ గౌడ్ మోర్చాల రాష్ట్ర నాయకులు శ్రీమతి ఎన్ జ్యోతి రమణ శ్రీమతి పి అలివేలు కొమ్ము సామేలు జిల్లా ఉపాధ్యక్షులు బి కుమారస్వామి పట్టణ ఏ సీతారాములు ఐటీ సెల్ విజయసాగర్ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు అశ్విని రాధ జిల్లా ప్రధాన కార్యదర్శి సుగురు లక్ష్మీ పట్టణ ప్రధాన కార్యదర్శులు రాములు రాయన్న సాగర్ మహిళా మోర్చా పట్టణ అధ్యక్షురాలు ఆవుల కవిత యాదవ్ నాయకులు రాఘవేందర్ రవి కుమార్ కొండన్న మన్యం తదితరులు పాల్గొన్నారు. (Story :  మహిళాభ్యున్నతి లక్ష్యంగా వికసిత్ భారత్ బడ్జెట్)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version