UA-35385725-1 UA-35385725-1

జామ్‌ జంక్షన్‌ పక్కా రీజినల్ బ్యాండ్స్ మ్యూజిక్ 

జామ్‌ జంక్షన్‌ పక్కా రీజినల్ బ్యాండ్స్ మ్యూజిక్ 

న్యూస్‌తెలుగు/హైద‌రాబాద్ సినిమా: ”జామ్‌జంక్షన్‌ మ్యూజిక్ కాన్సెప్ట్ నాకు చాలా నచ్చంది. కొత్తగా అనిపించింది. ఇలాంటి కాన్సెప్ట్ ఎక్కడా జరగలేదు. దిన్ని చాలా అద్భుతంగా చేయాలనిపించింది. చాలా మంది ట్యాలెంటెడ్ వాళ్ళని ఒక ఫ్లాట్ ఫాం మీద చూడబోతున్నాం. సిక్స్ బ్యాండ్స్ వన్ బై వన్ పెర్ఫార్మ్ చేస్తుంటే చూడటం మామూలు ఎక్సయిట్మెంట్ వుండదు” అన్నారు డైరెక్టర్ మారుతి.
డైరెక్టర్ మారుతి ప్రజెంట్స్ బిగ్గెస్ట్ మ్యూజికల్ ఈవెంట్ జామ్‌జంక్షన్‌ షో సెప్టెంబర్ 6న హైటెక్స్ గ్రౌండ్స్‌లో జరగనుంది. ఈ రోజు ఈవెంట్ కర్టెన్‌రైజర్‌ ప్రెస్ మీట్ గ్రాండ్ గా జరిగింది. సెన్సేషనల్ కంపోజర్ తమన్, నిర్మాత ఎస్కేఎన్ ఈ ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు.
ప్రెస్ మీట్ లో డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ.. జామ్‌ జంక్షన్‌ లో ఎవరైతే బాగా ఇంప్రస్ చేస్తారో వారికి క్యాష్ ప్రైజ్ తో పాటు మా మూవీస్ లో ఒక చిన్న సినిమాకి కూడా మ్యూజిక్ చేసే ఛాన్స్ ఇస్తామని అనౌన్స్ చేశాం. ఇది హెల్దీ ఎట్మాస్ఫియర్ లో టీమ్స్ అందరినీ ఎంకరేజ్ చేయడానికి చేస్తున్న ప్రోగ్రాం ఇది. అందరూ వచ్చి ఎంకరేజ్ చేస్తారని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. తమన్ ఇక్కడి వచ్చి వీళ్ళందరిని ఎంకరేజ్ చేయడం చాలా అనందంగా వుంది. జామ్‌జంక్షన్‌ చాలా పెద్దగా గ్రో అవుతుంది. దిన్ని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్ళబోతున్నాం. పెద్ద రేంజ్ లో ఆడియన్స్ కి చూపించబోతున్నాం’ అన్నారు
మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాట్లాడుతూ.. నేను బ్యాండ్ నుంచే వచ్చాను. బ్యాండ్ ఎమోషన్ నాకు తెలుసు. ఇప్పటికీ రెగ్యులర్ గా బ్యాండ్ మ్యూజిక్ కి వెళ్తాను. ఎలాంటి పాటలు ప్లే చేస్తున్నారు ? ఎలాంటి పాటలకు ఆడియన్స్ కనెక్ట్ అవుతున్నారు, ఎంత అప్డేట్ గా వున్నాం ఇవన్నీ చెక్ చేసుకుంటాను. బ్యాండ్ నుంచి ఎన్నో నేర్చుకున్నాను. హైదరాబాద్ ఇప్పుడు మ్యూజికల్ సిటీ. చాలా మంచి బ్యాండ్స్, మ్యుజిషియన్స్ వస్తున్నారు. వారితో కలసి పని చేస్తున్నాను. జామ్‌ జంక్షన్‌ లో పార్ట్ అవ్వడం ఆనందంగా వుంది. కాంపిటేషన్ లా కాకుండా మీ హైలో మీరు ప్లే చేయాలని కోరుకుంటున్నాను. మారుతి గారు బ్యాండ్స్ ని హైదరాబాద్ ప్రమోట్ చేస్తున్నారని తెలిసి చాలా ఆనందంగా అనిపించింది. ఆరు బ్యాండ్స్ తో మొదలౌతుంది, త్వరలోనే 60కి చేరుతుందని భావిస్తున్నాను. అందరికీ గుడ్ లక్ ‘చెప్పారు.
నిర్మాత ఎస్కేఎన్ మాట్లాడుతూ.. మంచి ప్రయత్నం చేస్తున్న టీంలో అందరికీ ఆల్ ది బెస్ట్. లాస్ట్ ప్రెస్ మీట్ లో ఇందులో విన్నర్ కి నా బ్యానర్ లో మ్యూజిక్ చేసే అవకాశం ఇస్తానని చెప్పాను. అది మరోసారి గుర్తు చేస్తున్నాను. మారుతి గారికి, తమన్ గారికి చాలా థాంక్స్. తమన్ గారు చాలా బిజీలో వుండి కూడా ఇక్కడి వచ్చి బ్యాండ్స్ ని విష్ చేయడం చాలా ఆనందంగా వుంది’ అన్నారు.
శ్రీ ఈవెంట్స్ కంపెనీ ఫౌండర్, సీఈవో శ్రీ మాట్లాడుతూ.. మారుతి గారికి తమన్ గారికి ఎస్కేఎన్ గారికి చాలా థాంక్స్. జామ్‌ జంక్షన్‌ కాన్సెప్ట్ చాలా యూనిక్ గా వుంటుంది. ఇందులో సిక్స్ డిఫరెంట్ స్టేజస్ వుంటాయి. సెవెన్ రౌండ్స్ వుంటాయి. మొదటి నాలుగు రౌండ్స్ లో వోన్ కంపోజిషన్, ఐదో రౌండ్ టాలీవుడ్, ఆరు ఇన్‌స్ట్రుమెంటల్, లాస్ట్ ఫ్యుజన్ సాంగ్స్. ఆరు బ్యాండ్స్ వన్ బై వన్ ప్లే చేస్తుంటారు. లాస్ట్ వన్ అవర్ తెలుగు డీజే వుంటుంది. మ్యూజిక్ లవర్స్ కి చాలా మంచి యాంబియన్స్ లో గ్రేట్ సౌండ్ అండ్ లైట్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చే బిగ్గెస్ట్ షో జామ్‌ జంక్షన్‌’ అన్నారు. బ్యాండ్ మెంబర్స్ అంతా ఈ ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు (Story :జామ్‌ జంక్షన్‌ పక్కా రీజినల్ బ్యాండ్స్ మ్యూజిక్ )

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1