చేతక్ 2901ని విడుదల చేసిన సిద్ది వినాయక బజాజ్
న్యూస్‌తెలుగు/హైదరాబాద్: ఆటోమోటివ్ పరిశ్రమలో సుప్రసిద్ధమైన సిద్ది వినాయక బజాజ్, రసూల్‌పురా మెట్రో స్టేషన్ సమీపంలోని బేగంపేట్ చేతక్ సీఈసీ షోరూమ్‌లో చేతక్ 2901ని విడుదల చేసింది. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డితో పాటుగా చేతక్ డివిజన్ నుండి మేనేజింగ్ డైరెక్టర్ కె వి బాబుల్ రెడ్డి, రీజనల్ మేనేజర్ కె మంజునాథ్, ఏరియా సేల్స్ మేనేజర్ ప్రవీణ్ పరదేశితో సహా ప్రముఖులు పాల్గొన్నారు. ఎలక్ట్రిక్ మొబిలిటీలో చేతక్ 2901 ఒక ముందడుగుగా నిలుస్తుంది, పట్టణ ప్రయాణ అనుభవాన్ని పునర్నిర్వచించటానికి అత్యాధునిక సాంకేతికతతో బలమైన డిజైన్‌ను ఇది మిళితం చేస్తుంది. ధృడమైన మెటల్ బాడీ, 123 కి.మీ. పరిధిని కలిగి ఉన్న ఈ మోడల్ నేటి రైడర్ల విభిన్న అవసరాలకు అనుగుణంగా రూపొందింది. మేనేజింగ్ డైరెక్టర్ కెవి బాబుల్ రెడ్డి ఈ ఆవిష్కరణ ఎలక్ట్రిక్ స్కూటర్లలో అత్యుత్తమ, నాణ్యమైన ఆవిష్కరణలను అందించాలనే ప్రయత్నంలో భాగమని తెలిపారు.