UA-35385725-1 UA-35385725-1

పవన్ కళ్యాణ్ తో ఆస్ట్రేలియా హై కమిషనర్ భేటీ

పవన్ కళ్యాణ్ తో ఆస్ట్రేలియా హై కమిషనర్ భేటీ

న్యూస్‌తెలుగు/అమ‌రావ‌తి: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో ఆస్ట్రేలియా హై కమిషనర్ ఫిలిప్ గ్రీన్ బుధవారం సాయంత్రం మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రి నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఫిలిప్ గ్రీన్ ని సత్కరించి, కూరగాయలతో కూడిన బొకే అందచేశారు. ఈ సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చించారు. రాష్ట్రం నుంచి ఉన్నత విద్యకు ఆస్ట్రేలియా వెళ్ళే విద్యార్థుల సంఖ్య పెరుగుతోందని, ఆ దేశంలో ఉన్న విద్యావకాశాలు, విద్యా సంస్థల వివరాలను తెలియచేసేందుకు తగిన గైడెన్స్ అందించాలని ఈ చర్చల్లో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించారు. అందుకు ఆస్ట్రేలియా హై కమిషనర్ సానుకూలంగా స్పందించారు. ఈ సమావేశంలో చెన్నైలోని ఆస్ట్రేలియా కాన్సల్ జనరల్ సిలై జాకి, ఆస్ట్రేలియా హై కమిషన్ ఎకనామిక్ కౌన్సిలర్ జూలియన్ స్టోర్మ్, ఆస్ట్రేలియా హై కమిషన్ అగ్రికల్చర్ కౌన్సిలర్ కిరణ్ కరమిల్ పాల్గొన్నారు. (Story: పవన్ కళ్యాణ్ తో ఆస్ట్రేలియా హై కమిషనర్ భేటీ)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1