పేదల బడ్జెట్ కాదిది!
రాష్ట్ర ప్రభుత్వం ఈ సమయంలో ప్రత్యేక హోదా కోసం పోరాడాలి.
కేంద్ర బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వానికి న్యాయం జరగలేదు
సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతీ వరప్రసాద్
న్యూస్‌తెలుగు/ వినుకొండ :
కేంద్ర ప్రభుత్వం ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ పేద ప్రజలకు ఏమాత్రం పనికి వచ్చే బడ్జెట్ కాదని కార్మికులు కష్టజీవులకు మధ్యతరగతి వేతన జీవులకు ఏమాత్రం ఆనందం కలిగించే విషయం లేదని అన్నారు. గత ఐదేళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి చేసిన పది లక్షల కోట్ల రూపాయల అప్పులకు సంవత్సరానికి 50 వేల కోట్లు వడ్డీ కిందే కట్టవలసి వస్తుందని ఆ వడ్డీ మొత్తం కేంద్ర ప్రభుత్వమే భరిస్తే ఈనాటి వరకు విభజన హామీల మేరకు చట్ట ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన నిధుల లేమి కొంత వూరట కలిగించినా కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా ప్రత్యేక ప్యాకేజీ పేరుతో రాష్ట్ర ప్రభుత్వాన్ని సంతృప్తి పరచాలని ప్రయత్నించడం, అలాగే రాష్ట్రంలోని ప్రధాన పరిశ్రమ విశాఖ ఉక్కు పరిశ్రమకు నిధులు కేటాయించకపోవడం అనుమానించవలసిన పరిస్థితి ఉందని ఈనాటికి నరేంద్ర మోడీ, అమిత్షాలు గాని విశాఖ ఉక్కును ప్రైవేటీకరించబోము అని చెప్పడం లేదని అన్నారు. అమరావతికి 15 వేల కోట్లు కేటాయించడం కొంత హర్షించదగిన విషయమే అయినప్పటికిని విశాఖ రైల్వే జోన్ కడప స్టీల్ ఫ్యాక్టరీ పోలవరం ప్రాజెక్టుకు నిధులు కేటాయింపు స్పష్టంగా పేర్కొనలేదని ఆయన విమర్శించారు. నిరుద్యోగులకు నిరాసే మిగిలిందని రాష్ట్ర అభివృద్ధికి కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేయుటకు కేంద్రం రాష్ట్రానికి తగిన నిధులు కేటాయించలేదని ఆయన విమర్శించారు. పెట్టుబడిదారుల స్వర్గధామంగా దేశంలో నరేంద్ర మోడీ విధానాలు ఉన్నాయని పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఈ బడ్జెట్ ఏ మాత్రం పనికిరాదని ఆయన కేంద్రాన్ని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రణాళిక ప్రకారం కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర అభివృద్ధికి కావలసిన నిధులను పోలవరం ప్రాజెక్టుకు నిర్వాసితులకు ఇవ్వవలసిన నిధులను వెంటనే కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేయాలని మారుతీ కోరారు. (Story : పేదల బడ్జెట్ కాదిది..!)