UA-35385725-1 UA-35385725-1

నేరాల నియంత్రణకు పోలీసు గస్తీ ముమ్మరం చేయాలి

నేరాల నియంత్రణకు పోలీసు గస్తీ ముమ్మరం చేయాలి

జిల్లా ఎస్సీ వకుల్ జిందల్, ఐపిఎస్

న్యూస్‌తెలుగు/ విజయనగరం: జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మంగళవారం 1వ పట్టణ పోలీసు స్టేషనుని, సెంట్రల్ క్రైం స్టేషనును సందర్శించి, స్టేషను ప్రాంగణాన్ని, పోలీసు బిల్డింగ్ లోని ప్రతీ గదిని, లాకప్ గదులను పరిశీలించారు. పోలీసు స్టేషను ప్రాంగణంలో సీజ్ చేసి ఉన్న వాహనాల ఏ కేసులోనిది తెలిసే విధంగా ట్యాగ్ చేయ్యాలని, రికార్డు మెయింటెయిన్ చేయాలని అధికారులను ఆదేశించారు. రికార్డులు తనిఖీ చేసారు. పోలీసు స్టేషన్ సిబ్బందితో మమేకమై, వారు నిర్వర్తిస్తున్న విధులను అడిగి తెలుసుకున్నారు. స్టేషనులో పని చేస్తున్న ఎస్సైలను ఎప్పటి నుండి పని చేస్తున్నది. గతంలో ఎక్కడ పని చేసినది అడిగి తెలుసుకున్నారు. అనంతరం, స్టేషనులో క్రైమ్ చార్ర్ట్ పరిశీలించి, 1వ పట్టణ పోలీసు స్టేషను పరిధిలో ఏ తరహా నేరాలు జరుగుతున్నది, ఏ ప్రాంతంలో జరుగుతున్నది. నేరాల నియంత్రకు 1వ పట్టణ పోలీసులు తీసుకున్న చర్యలను అధికారులను అడిగి జిల్లా ఎస్పి తెలుసుకున్నారు. పట్టణంలో ఏ తరహా నేరాలు జరుగుతున్నది. వాటి నియంత్రణకు పోలీసులు చేపడుతున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. నేరాల నియంత్రకు గస్తీ, పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. బీట్లు తిరిగే సమయంలో హిస్టరీ షీట్లు కలిగిన వారిని చెక్ చేయాలని, వారి కదలికలపై నిఘా పెట్టాలని అధికారులను ఆదేశించారు. పోలీసు స్టేషనులో పని చేసే ప్రతీ ఒక్కరికీ చెడు నడత కలిగిన వ్యక్తులు గురించి తెలియాలన్నారు. గంజాయి వినియోగదారులపై కఠినంగా వ్యవహరించాలని, గంజాయి సేవించి ఎవరైనా పట్టుబడితే వారిపై కేసులునమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు జరిపే వ్యక్తులను, గంజాయి వినియోగించే వారిని గుర్తించి, వారిపై నిఘా ఏర్పాటు చేయాలన్నారు. గంజాయి అక్రమ రవాణా నియంత్రకు దాడులుముమ్మరం చేయాలని, ఆకస్మికంగా లాడ్జెన్, వాహన తనిఖీలు, రైల్వే స్టేషను, ఆర్టీసి కాంప్లెక్స్ ప్రాంతాలల్లో తనిఖీలుచేపట్టాలన్నారు. ఇతర రాష్ట్రాల నుండి వచ్చి, తాత్కాలికంగా నివాసం ఏర్పరుచుకునే వ్యాపారులపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. అనంతరం, స్టేషనులో చెడు నడత కలిగిన వ్యక్తుల హిస్టరీ షీట్లును జిల్లా ఎస్పి పరిశీలించి, వారిపై హిస్టరీ షీటు నమోదు చేయుటకుగల కారణాలను, ప్రస్తుతం సదరు వ్యక్తి స్థితిగతులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. హిస్టరీ షీట్లు కలిగిన వ్యక్తులపై నమోదు అయిన కేసులను, ప్రస్తుతం వాటి స్థితులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. మహిళల భద్రత, సైబరు నేరాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు కళాశాలలు సందర్శించి, యువతకు అవగాహన కల్పించాలన్నారు. అనంతరం, పోలీసు స్టేషనుకు సంబంధించిన జనరల్ డైరీ, ఎఫ్ఐఆర్ ఇండెక్స్, రిసెప్షన్ రిజిస్టర్, సిడీ ఫైల్స్, గ్రేవ్ కేసులను, బీటు ఋక్కులను తనిఖీ చేసి, అధికారులకు దిశా నిర్దేశం చేసారు. గంజాయి అక్రమ రవాణా నియంత్రకు చర్యలు చేపట్టాలని, పట్టుబడిన నిందితులనే కాకుండా అక్రమ రవాణకి కారకులైన ప్రధాన వ్యక్తులను గుర్తించి, అరెస్టు చేయాలని అధికారులను ఆదేశించారు.

స్టేషన్ సందర్శించిన వారిలో విజయనగరం డిఎస్పీ ఆర్.గోవిందరావు, 1వ పట్టణసిఐ బి. వెంకటరావు, స్పెషల్ బ్రాంచ్ సిఐ కే.కే. వి. విజయనాథ్, 1వ పట్టణ ఎస్సై లు ఎ.నరేష్, జే. తారకేశ్వరరావు, హరిబాబు నాయుడు, నవీన్ పడాల్, సీసీఎస్ ఎస్సై భాగ్యం ఇతర అధికారులు, సిబ్బంది హాజరుగా ఉన్నారు. (Story : నేరాల నియంత్రణకు పోలీసు గస్తీ ముమ్మరం చేయాలి)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1