కోర్టుకెక్కిన జగన్!
న్యూస్‌తెలుగు/అమరావతి: వైఎస్ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అనూహ్యంగా కోర్టుకెక్కారు. ఇంతకీ ఎందుకో తెలుసా? తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మంగళవారం పిటిషన్ వేశారు. తనకు ప్రతిపక్ష హోదా ఇచ్చేలా అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడిని ఆదేశించాలని జగన్ విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్ష హోదా కోసం అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడికి లేఖ రాసినా ఆయన స్పందించలేదని పిటిషన్‌లో వివరించారు. జగన్ తన పిటిషన్‌లో అసెంబ్లీ కార్యదర్శికి, శాసనసభ వ్యవహారాల మంత్రిని ప్రతివాదులుగా చేర్చారు. సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలై, కేవలం 11 సీట్లకే పరిమితమైంది. అసెంబ్లీలో మాట్లాడాలంటే జగన్‌కు సాధారణ ఎమ్మెల్యే స్థాయిగానే సమయం ఇస్తారు. దానికితోడు ఎమ్మెల్యే హోదాతోనే భద్రత ఉంటుంది. సంఖ్యా బలం లేకపోయినప్పటికీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్నందున,ఆ హోదాను కల్పించాలని జగన్ స్పీకర్‌కు ఇటీవల లేఖ రాసినా స్పందించలేదు. దీంతో తనకు ప్రతిపక్ష హోదా ఇచ్చేలా చూడాలని హైకోర్టులో జగన్ పిటిషన్ వేశారు. (Story: కోర్టుకెక్కిన జగన్!)

