ఐడిబిఐ బ్యాంక్ ఆర్థిక ఆర్థిక ఫలితాలు
న్యూస్‌తెలుగు/ముంబయి: ఐడిబిఐ బ్యాంక్ పనేడు ఈ ఆర్థిక సంవత్సవం (ఎఫ్‌వై25) మొదటి త్రైమాసికం (క్యూ1) ఫలితాలను ప్రకటించింది. ఇది క్యూ1 ఎఫ్‌వై25కి నికర లాభం రూ.1,719 కోట్లుగా ఉండగా, ఇది ఏడాది నుంచి ఏడాదికి 40% బలమైన వృద్ధిని నమోదు చేసింది. నిర్వహణ లాభం రూ.2,076 కోట్లుగా ఉంది. మొత్తం వడ్డీ రాబడి 4.18% వద్ద నమోదు కాగా, క్యూ1-2024లో రూ.3,998 కోట్ల నుంచి క్యూ1-2025లో నికర వడ్డీ ఆదాయం రూ.3,233 కోట్లుగా ఉంది. అదే విధంగా క్యూ1-2024లో 4.12%తో పోలిస్తే క్యూ1-2025లో డిపాజిట్ ధర 4.58%గా ఉంది. ఏడాది నుంచి ఏడాదికి 209 బీపీఎస్ వృద్ధితో సీఆర్‌ఏఆర్ 22.42% వద్ద ఉంది. ఆస్తులపై రాబడి .83%, ఏడాది నుంచి ఏడాదికి వృద్ధి 34 బీపీఎస్, రిటర్న్ ఆన్ ఈక్విటీ 19.87% కాగా ఏడాది నుంచి ఏడాదికి ఇది 123 బీపీఎస్ వృద్ధి చెందింది. జూన్ 30, 2023 నాటికి 0.44% నుంచి నికర ఎన్‌పీఏ 0.23%, స్థూల ఎన్‌పీఏ జూన్ 30, 2023 నాటికి 5.05% నుంచి 3.87%కు చేరుకుంది. (Story : ఐడిబిఐ బ్యాంక్ ఆర్థిక ఆర్థిక ఫలితాలు)