UA-35385725-1 UA-35385725-1

స్వల్పంగా గోదావరి తగ్గుముఖం

స్వల్పంగా గోదావరి తగ్గుముఖం

కొనసాగుతున్న 2వ ప్రమాదహెచ్చరిక

– వీడని వరధ భయం

– వరదలను ఎదుర్కొనేందుకు నంసిద్ధంగా అధికారులు

న్యూస్‌తెలుగు/ భద్రాచలం: గోదావరి కొద్దిగా శాంతిస్తోంది. నిన్నటి ఉదయం 7 గం.లకు 51.06 అడుగులకు చేరుకున్న వరద అక్కడ్నుంచి నిలకడగా మారింది. మధ్యాహ్నం 11.30 గం.ల నుండి క్రమంగా తగ్గుతూ వచ్చింది. 12 గం.లకు 51.4, 1 గం.కు 51.03, సాయంత్రం 4 గం.లకు 50.06 అడుగుల దిగువకు ప్రవహిస్తోంది. ఎగువన వర్షాలు లేకపోవడంతో పాటు తాలిపేరు నుండి కూడా పెద్దగా నీరు విడుదల కాకపోవడంతో భద్రాచలం వద్ద తగ్గుతోంది. పేరూరు వద్ద కూడా గోదావరి నెమ్మదిగా తగ్గు ముఖం పట్టింది. ఉదయం 8గం.లకు 17 మీటర్లు ఉండగా సాయంత్రానికి 15 మీటర్లకు తగ్గింది. ఇదిలా ఉండగా ఏపిలోని కూనవరం మండలం గోదావరి తీరంలో శబరి నది పోటెత్తుతోంది. దీంతో గోదావరి ప్రవాహ వేగం మందగించే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా దుమ్ముగూడెం వెళ్లే దారిలో తూరుబాక వద్ద గోదావరి నది రోడ్డు ఎక్కడంతో రాకపోకలు నిలిచిపోయాయి, బూర్గంపాడు మండలంలోని సారపాక, నాగినేనిప్రోలు రెడ్డిపాలెం రహదారిపైకి వరద నీరు చేరడంతో రాకపోకలు ఆగిపోయాయి. అశ్వాపురం మండలం మొండికుంట -ఇరవెండి రహదారిలోని రామచంద్రాపురం స్టేజీ వద్ద గోదావరి తిష్ట వేసింది. వరద క్రమంగా తగ్గుముఖం తగ్గితే బుధవారం నుండి ఈ రోడ్లపై రాకపోకలు కొనసాగే అవకాశముంది.

కొనసాగుతున్న రెండో ప్రమాదహెచ్చరిక –
గోదావరి క్రమంగా శాంతిస్తున్నప్పటికీ భద్రాచలం వద్ద 2వ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. బుధవారం తెల్లవారుఝాము వరకు తగ్గి 48 అడుగులకు దిగువకు చేరుకుంటే తప్ప హెచ్చరికను ఉపసంహరించే పరిస్థితి లేదు. ఎగువన ఛత్తీస్ గఢ్ లో మళ్లీ పర్షాలు కురిసి తాలిపేరుకు వరద చేరి ఆ వరద గోదార్లోకి విడుదలైనా, ఎగువ ప్రాజెక్టుల నుండి నీరు దిగువకు విడుదైలనా, ఇంద్రావతి, ప్రాణహిత నదులు పొంగిపొర్లినా మళ్లీ గోదావరికి వరద తాకిడి తప్పదు.
వీడని వరద భయం –
గోదావరి ప్రస్తుతానికి శాంతిస్తున్నప్పటికీ వరద భయం మాత్రం ఈ ప్రాంత ప్రజలను వీడటం లేదు. జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్మాసాల్లో గోదావరి వరదల అలజడి ఇక్కడి ప్రజానికాన్ని పట్టి వేదిస్తుంటుంది. 1975 నుండి 2004 వరకు 39 సం.లలో 49 సార్లు గోదావరికి వరదలు కాదా మొదటి ప్రమాదహెచ్చరికను దాటి 36 సార్లు ప్రవహరించింది. మొత్తంగా జూన్లో 03 సార్లు, జూలైలో 09 సార్లు, ఆగస్టులో 28 సార్లు, సెప్టెంబర్లో 07 సార్లు వరదలు ముంచెత్తాయి. ఇప్పటి వరకు వచ్చిన వరదల్లో 1986 ఆగస్టు 14న 75.06అడుగులు, 2022 జూలై16న 71.03 అడుగులు, 1990 ఆగస్టు 24న 70,085, 2006 ఆగస్టు 6న 66,09అ, 1976 జూన్ 22న 63.09 అడుగుల వరదలు మొదటి 5 స్థానాల్లో రికార్డులకు ఎక్కాయి.
సిద్ధం –

ప్రస్తుతానికి వరద భయం కాస్తంత తగ్గుతున్నప్పటికీ ఇంకా ఆగస్టు, సెప్టెంబర్ మాసాలు ఉండటంతో ఈ ప్రాంత ప్రజలతో పాటు రైతాంగం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా ఎదుర్కునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, నిధుల కొరత లేదని సాక్షాత్తూ మంత్రే వెల్లడించారు. యంత్రంగా కూడా వరద సహాయక చర్యల్లో ముమ్మరంగా పాల్వంచుకునేందుకు రెడీ అయ్యారు. జిల్లా కలెక్టర్ నేతృత్వంలో, ఎస్పి ఆధ్వర్యంలో డిడిఆర్ఎఫ్, ఎన్ఎఆర్ఎఫ్ బలగాలు గోదావరి తీరంలో సిద్ధంగా ఉన్నాయి. గణితగాళ్లను సిద్ధం చేశారు. నాటుపడవలతో పాటు మరపడవలను తెప్పించారు. ఇరిగేషన్, కేంద్ర జలవనరుల సంఘం అధికారులు ఎప్పటికప్పుడు వరద పరిస్థితిని పరిశీలిస్తూ సమాచారాన్ని అందజేస్తున్నారు. (Story : స్వల్పంగా గోదావరి తగ్గుముఖం)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1