12 జ్యోతిర్లింగ రామ కథా యాత్రపై డాక్యుమెంటరీ
న్యూస్‌తెలుగు/హైదరాబాద్: ప్రఖ్యాత ఆధ్యాత్మిక వేత్త మొరారి బాపు 2024 జూలై 21న గురుపూర్ణిమ శుభ సందర్భంగా రెండు ఆకర్షణీయమైన కొత్త పుస్తకాలతో పాటు ఆకట్టుకునే రీతిలో ఒక డాక్యుమెంటరీ చిత్రంను విడుదల చేశారు. ఆధ్యాత్మిక పరిజ్ఞానం, వ్యక్తిగత అనుభవాలతో కూడిన ఈ పుస్తకాలు, చిత్రం ప్రేక్షకులను ఆకర్షిస్తాయి, స్ఫూర్తిని అందిస్తాయి. సినిమా, పుస్తకాల విడుదల సందర్భంగా బాపు తన ఆనందాన్ని వ్యక్తం చేసి, శుభప్రదమైన ‘యోగ్’ని సూచించారు. ఈ పుస్తకాలు, చిత్రం విడుదల చేసిన 2024 జూలై 21 వ తేదీకి ఒక ప్రత్యేకత వుంది. అదేమిటంటే అద్భుతమైన 12 జ్యోతిర్లింగ రామ కథా యాత్రను ప్రారంభించడానికి యాత్రికులు కేదార్‌నాథ్ చేరుకుని తమ యాత్రని సరిగ్గా సంవత్సరం క్రితం అంటే 2023 జూలై 21న వారు యాత్ర ప్రారంభించారు. (Story : 12 జ్యోతిర్లింగ రామ కథా యాత్రపై డాక్యుమెంటరీ)