UA-35385725-1 UA-35385725-1

తహసిల్దార్ ఆఫీస్ ముందు ధర్నా

తహసిల్దార్ ఆఫీస్ ముందు ధర్నా

•జలదిగ్బంధంలో ఉన్న వoజీరి గ్రామాన్ని ఆదుకోవాలని ఎమ్మార్వో కి వినతి 

•ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే కలెక్టరేట్ ను ముట్టడిచేస్తాం

•కాంట్రాక్టర్, ఇంజనీర్ల, అసమర్ధత వల్ల గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారు

న్యూస్‌తెలుగు/కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా, కాగజ్ నగర్ : గత వారం రోజులుగా ఏడతెగకుండా కురుస్తున్న వర్షానికి కాగజ్ నగర్ నుండి వంజిరి వెళ్లే మార్గమధ్యలో రైల్వే అండర్ బ్రిడ్జి నీటిలో మునిగిపోయింది.
ఈ విషయమై రైల్వే అధికారులకు ఫిర్యాదు చేసిన ఎటువంటి రక్షణ చర్యలు చేపట్టలేదు.

కాగజ్ నగర్ తహసిల్దార్ ఆఫీస్ ముందు బిఆర్ఎస్ నాయకులు ధర్నా చేసి వినతి పత్రం అందజేశారు.
ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోకపోతే కలెక్టరైట్ ని ముట్టడిస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, సిర్పూర్ నియోజకవర్గ కన్వీనర్ లెండుగురే శ్యామ్ రావు, కో-కన్వీనర్ మొయిన్ ఉద్దీన్, మాజీ మున్సిపల్ చైర్మన్ సీపీ రాజ్ కుమార్, అంబాల ఓదెలు, కన్నయ్య, సలీం, నక్క మనోహర్, కశిపాక రాజు, పిప్రే రావూజి, గౌత్రే గోపాల్, మరియు తదితర నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

(Story : తహసిల్దార్ ఆఫీస్ ముందు ధర్నా)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
UA-35385725-1