సత్య కళాశాల లో గురు పూర్ణిమ
న్యూస్‌తెలుగు/విజయనగరం టౌన్ : స్థానిక తోట పాలెం లో గల సత్య డిగ్రీ, పీజీ కళాశాలలో ఆదివారం గురు పూర్ణిమ సందర్భంగా వ్యాస మహర్షి కి పూజలు నిర్వహించి విద్యార్థులు అధ్యాపకులకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా కళాశాల సంచాలకులు డాక్టర్ ఎం శశి భూషణ రావు మాట్లాడుతూ గురువులను, ఉపాధ్యాయులను, పెద్దలను గురుపూర్ణిమ లేదా వ్యాస పూర్ణిమ నాడు పూజిస్తారని, ఆషాఢ పూర్ణిమ రోజున గురు పూర్ణిమ జరుపుకుంటారని, గురువులను సత్కరించి వారి ఆశర్వాదములు తీసుకుంటారని, గురువుల పట్ల ఇదే గౌరవం ప్రతీ రోజూ పాటిస్తున్నప్పటికి ఈ రోజు వ్యాస మహర్షి పుట్టిన రోజు కాబట్టి ఈ రోజు కు అంత ప్రాధాన్యత వుందన్నారు. కళాశాల తెలుగు అధ్యాపకులు వ్యాస మహర్షి పుట్టు పూర్వోత్తరాలు ఆయన గొప్పతనం గురించి వివరించి విద్యార్థులలో గురు బ్రహ్మ గురువిష్ణు శ్లోకాన్ని పఠింప చేశారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం వి సాయి దేవ మణి, ఎన్ సి సి ఆఫీసర్ ఎం ఉదయ్ కిరణ్, ఎన్ ఎస్ ఎస్ ఆఫీసర్ బి సూరఫు నాయుడు, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. (Story : సత్య కళాశాల లో గురు పూర్ణిమ )