పైడి తల్లి అమ్మవారి దేవాలయంలో చండీ హోమం
న్యూస్‌తెలుగు/విజయనగరం టౌన్: గురుపౌర్ణమి సందర్భంగా ఆదివారం పట్టణంలోని శ్రీ పైడితల్లి అమ్మవారి దేవస్థానం వనంగుడి ,చదురుగుడిలో దేవస్థానం ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం వేదపండితులు చండీ హోమం, పూర్ణాహుతి నిర్వహించారు. ఇఓ.డివివిప్రసాదరావు పర్యవేక్షణలో జరిగిన ఈకార్యక్రమంలో వేదపండితులు తాతా రాజేష్ శర్మ, దూసి శివరాం శర్మ, వివి నరసింహమూర్తి శర్మలు పాల్గొన్నారు. రైల్వే స్టేషన్ వద్ద ఉన్న వనంగుడిలో అమ్మవారు శాకాంబరీ దేవిగా భక్తులకు దర్శనం ఇచ్చారు. పైడితల్లమ్మ వారిని దర్శించుకునేందుకు సుదూర ప్రాంతాల నుండి భక్తులంతా ఉదయం నుండే దేవాలయం వద్దకు విచ్చేశారు ఈ సందర్భంగా ఆలయ ఈవో డివివి ప్రసాద్ రావు మాట్లాడుతూ ప్రతి నెల లోక కళ్యాణార్థం వేద పండితులతో జరిగే అమ్మవారి చండీ హోమంలో పాల్గొనాలంటే దేవాలయం వద్ద ఉండే ఆఫీసులో సంప్రదించాలన్నారు. ప్రతిరోజు వలె ఆదివారం కూడా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. దేవాలయాల వద్దకు విచ్చేస్తున్న భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా దేవస్థానం అధికారులు చర్యలు చేపట్టారు. (Story : పైడి తల్లి అమ్మవారి దేవాలయంలో చండీ హోమం)