మత విద్వేషాలను రెచ్చకొడుతున్న బీజేపీ
ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారు
శ్వేత పత్రాలు విడుదల పేరుతో కాలయాపన చేస్తున్న బాబు
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కెవివి ప్రసాద్,జి.ఈశ్వరయ్య
న్యూస్‌తెలుగు/రాయచోటి :దేశంలో మూడవ సారి అధికారంలోకి వచ్చిన ప్రదాణి నరేంద్ర మోడీ విద్వేషాలను రెచ్చకొడుతున్నాడని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తూ నిర్వీర్యం చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కెవివి ప్రసాద్, జి ఈశ్వరయ్య ఆరోపించారు
ఆదివారం స్థానిక ఎన్జీవో హోంలో సీపీఐ జిల్లా జనరల్ బాడీ సమావేశం సీపీఐ జిల్లా సహయ కార్యదర్శి మహేష్ అధ్యక్షతన జరిగింది
ఈ సందర్భంగా కెవివి ప్రసాద్, జి ఈశ్వరయ్య మాట్లాడుతూ దేశంలో 400 పార్లమెంటు సీట్లు గెలుస్తామని దేశమంతా ప్రచారం చేసిన మోడీ మూడవ సారి అధికారం చేపట్టడానికి ఇతర పార్టీల మద్దతు కావాల్సివచ్చిందని తెలిపారు
గత పదేళ్లలో మోడీ ప్రభుత్వం ప్రజా రైతాంగ కార్మిక వ్యతిరేక విధానాలను ప్రజలు ఎండకట్టారని అందుకే పార్లమెంటులో బీజేపీకి సీట్లు తగ్గాయన్నారు.ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తూ నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు.దేశంలో ప్రజా స్వేచ్ఛను హరిస్తున్నారని, ప్రశ్నించే గొంతుకులను అకారణంగా జైళ్లకు పెంచుతున్నారని విమర్శించారు
రాష్ట్రంలో టిడిపి కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్వేత పత్రాలు విడుదల పేరుతో కాలయాపన చేస్తున్నారని విమర్శించారు . కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందే అనేక ప్రజా సమస్యలు మిగిలిపోయాయని వాటి పరిష్కారానికి చొరవ చూపాలని కోరారు.గాలేరు ,నగిరి ప్రాజెక్టులను పూర్తి చేయాలని,పించా, అన్నమయ్య ప్రాజెక్టులు పునః నిర్మాణానికి తగిన నిధులు కేటాయించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.పార్లమెంటులో అసెంబ్లీలలో వామపక్షాలు భలం తక్కువ ఉన్న అనునిత్యం ప్రజా సమస్యలపై కమ్యూనిస్టు పార్టీల కార్యకర్తలు నిరంతరం ప్రజా ఉద్యమాలు చేపడతామని తెలిపారు
ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శివారెడ్డి ,జిల్లా కార్యదర్శి పి.ఎల్ నరసింహులు , సహాయ కార్యదర్శి మహేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు కృష్ణప్ప, మనోహర్ రెడ్డి, సాంబశివ,సిద్దిగాళ్ళ శ్రీనివాసులు, విశ్వనాథ్ నాయక్, సుదీర్,మురళి, సుమిత్రమ్మ, జ్యోతి చిన్నయ్య, కోటేశ్వరరావు, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు. (Story : మత విద్వేషాలను రెచ్చకొడుతున్న బీజేపీ )