ఉరకలేస్తున్న గోదావరి
వాగులు గోదారిలో చేపల వేటకు వెళ్లకూడదు
సీఐ బండారి కుమార్
న్యూస్‌తెలుగు/ వాజేడు వెంకటాపురం: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి ఉరకలేస్తుంది. తెలంగాణ ఛత్తీస్గడ్ సరిహద్దుల్లో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు నిండుకుండలా ప్రవహిస్తున్నాయి. దీంతో గోదావరికి వరద తాకిడి పెరిగింది. వాజేడు వెంకటాపురం మండలాలలోని కొంగలవాగు, ఇసుక వాగు, చీకుపల్లి వాగు , పెంకవాగులు , ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. శనివారం పెంకవాగును సందర్శించిన వెంకటాపురం సిఐ బండారి కుమార్, ఎస్సై కొప్పుల తిరుపతిరావు సమీప గ్రామాల ప్రజలతో మాట్లాడి గోదావరి వరదలు పెరుగుతున్న నేపథ్యంలో ఎవరు కూడా చేపల వేటకు గోదావరి, వాగుల వద్దకు వెళ్ళరాదని సూచించారు. వరదల నేపథ్యంలో పశువుల కాపరులు సైతం అప్రమత్తంగా ఉండాలని అడవుల్లోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. (Story : ఉరకలేస్తున్న గోదావరి)