సత్తా చాటిన పారా అథ్లెట్స్
న్యూస్‌తెలుగు/హైదరాబాద్: ఆదిత్య మెహతా ఫౌండేషన్‌లో శిక్షణ పొందిన నవోదయ విద్యాలయ సమితి పారా అథ్లెట్స్ సత్తా చాటారు. బెంగళూరులోని శ్రీ కాంత్వీరవ స్టేడియంలో జరిగిన 13వ జాతీయ జూనియర్, సబ్ జూనియర్ పారా అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్‌లో 16 పతకాలు సాధించారు. ఈ ఈవెంట్ జూలై 15 నుంచి 17వ తేదీ వరకు జరిగాయి. భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు జవహర్ నవోదయ విద్యాలయ (జేఎన్వీ) సహకారంతో ఆదిత్య మెహతా ఫౌండేషన్‌లో శిక్షణ పొందారు. వీరు ఎక్సలెన్స్ జేఎన్వీ రంగారెడ్డి సెంటర్‌లో ఉంటున్నారు. ఆదిత్య మెహతా ఫౌండేషన్‌కు చెందిన ఇన్ఫినిటీ పారాస్పోర్ట్స్ అకాడమీలో శిక్షణ పొందుతున్నారు. ఈ సందర్భంగా ఆదిత్య మెహతా ఫౌండేషన్ కోచ్, వ్యవస్థాపకుడు ఆదిత్య మెహతా మాట్లాడుతూ ఈ విజయం అపూర్వమైనదన్నారు. యువ పారా-అథ్లెట్ల అంకితభావానికి నిదర్శనమన్నారు. ఆదిత్య మెహతా ఫౌండేషన్ పారాథ్లెట్‌లను గుర్తించి.. జాతీయ, అంతర్జాతీయ వేదికలపై రాణించేందుకు అవసరమైన వనరులు, శిక్షణను అందించడానికి కట్టుబడి ఉందన్నారు. (Story : సత్తా చాటిన పారా అథ్లెట్స్)