Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ పూడికతీత యుద్ధ ప్రాతిపదికన చేయించాలి 

పూడికతీత యుద్ధ ప్రాతిపదికన చేయించాలి 

0

పూడికతీత యుద్ధ ప్రాతిపదికన చేయించాలి 

కమిషనర్

న్యూస్‌తెలుగు/గుంటూరుః నగరంలో పూడిక తీత జరగని ప్రాంతాల్లో యుద్దప్రాతిపదికన తీయించాలని, తీసిన పూడికను ఎప్పటికప్పుడు తరలించాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి, ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కమిషనర్ కెవిపి కాలనీ, పట్టాభిపురం, స్తంభాల గరువు, భాగ్య నగర్, తుఫాన్ నగర్ తదితర ప్రాంతాల్లో ఆకస్మికంగా పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో పారిశుధ్యం, డ్రైన్లలో పూడికతీత పనులను పరిశీలించి, అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగరంలో ఇప్పటికే అన్ని ప్రాంతాల్లోని డ్రైన్లలో పూడికతీత పనులకు అవసరమైన టెండర్లు ప్రక్రియ పూర్తి అయిందని, ఎక్కువ ప్రాంతాల్లో పూడికతీత పనులు కూడా పూర్తి చేయడం జరిగిందన్నారు. కాని కొన్ని ప్రాంతాల్లో పూడిక తీత పనుల్లో జాప్యం జరుగుతుందని, సదరు జాప్యం వలన వర్షాలకు డ్రైన్లు పొంగి ప్రజలు ఇబ్బందులు పడతారన్నారు. కనుక ఇంజినీరింగ్ అధికారులు తక్షణం పూడికతీత పనులు చేపట్టపాలన్నారు. భాగ్య నగర్ ప్రాంతంలో కచ్చా డ్రైన్ పూడిక తీయక పోవడం పై ఏఈ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెంటనే పనులు చేపట్టాలన్నారు. అలాగే స్థానిక ప్రజల నుండి పారిశుద్యం పై అందిన ఫిర్యాదుల మేరకు ఇంటింటి చెత్త సేకరణ, మధ్యాహ్నం గ్యాంగ్ వర్క్ ద్వారా అంతర్గత డ్రైన్లను శుభ్రం చేయించాలని శానిటరీ ఇన్స్పెక్టర్ ని ఆదేశించారు. పట్టాభిపురం మెయిన్ రోడ్ సెంట్రల్ డివైడర్ వెంబడి మట్టి ఉండడం గమనించి, ప్రతి రోజు శుభ్రం చేయాలని శానిటరీ సూపర్వైజర్ ని ఆదేశించారు. ప్రత్యేక పారిశుధ్య పనుల పర్యవేక్షణ స్పెషల్ అధికారులు ప్రతి రోజు ఉదయం 5:30 గంటల నుండి తమకు కేటాయించిన ప్రాంతాల్లో క్షేత్ర స్థాయిలో పర్యటించాలని, పారిశుద్యం పై ప్రజల నుండి అందుతున్న ఫిర్యాదుల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి అధికారి వైర్ లెస్ సెట్ వినియోగించాలన్నారు.
పర్యటనలో స్పెషల్ అధికారులు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, కార్యదర్శులు పాల్గొన్నారు. (Story : పూడికతీత యుద్ధ ప్రాతిపదికన చేయించాలి )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version