Home వార్తలు శాంసంగ్‌ గెలాక్సీ వాచ్‌ 7, వాచ్‌ అల్ట్రా, బడ్స్‌ 3 సిరీస్‌ ప్రీ బుకింగ్స్‌ షురూ

శాంసంగ్‌ గెలాక్సీ వాచ్‌ 7, వాచ్‌ అల్ట్రా, బడ్స్‌ 3 సిరీస్‌ ప్రీ బుకింగ్స్‌ షురూ

0

శాంసంగ్‌ గెలాక్సీ వాచ్‌ 7, వాచ్‌ అల్ట్రా, బడ్స్‌ 3 సిరీస్‌ ప్రీ బుకింగ్స్‌ షురూ

న్యూస్‌తెలుగు/గురుగ్రామ్‌: భారతదేశపు అతిపెద్ద వినియోగదారు ఎలక్ట్రానిక్స్‌ బ్రాండ్‌ శాంసంగ్‌ తమ సరికొత్త గెలాక్సీ బడ్స్‌ 3 , గెలాక్సీ బడ్స్‌ 3 ప్రో , గెలాక్సీ వాచ్‌ 7 మరియు గెలాక్సీ వాచ్‌ అల్ట్రా స్మార్ట్‌వాచ్‌లను ముందస్తు (ప్రీ)-ఆర్డర్‌ చేసే వినియోగదారుల కోసం అద్భుతమైన ఆఫర్‌లను ప్రకటించింది. ప్రతి ఒక్కరికీ సమగ్రమైన వెల్‌నెస్‌ అనుభవాలను అందించడానికి రూపొందించబడిన వేరబల్‌ పరికరాల ద్వారా మరింత మందికి గెలాక్సీ ఏఐ శక్తిని గెలాక్సీ వాచ్‌ 7, గెలాక్సీ వాచ్‌ అల్ట్రా విస్తరింపజేస్తాయి. గెలాక్సీ వాచ్‌ పోర్ట్‌ఫోలియోకి సరికొత్త మరియు అత్యంత శక్తివంతమైన జోడిరపు-గెలాక్సీ వాచ్‌ అల్ట్రా. అత్యుత్తమ మేధస్సు, సామర్థ్యాలతో తదుపరి దశ విజయాల కోసం మెరుగైన ఫిట్‌నెస్‌ అనుభవాల కోసం రూపొందించబడిరది. రక్షణ, విజువల్‌ సంపూర్ణతను మెరుగుపరచడానికి వాచ్‌ అల్ట్రా కొత్త కుషన్‌ డిజైన్‌ను పొందింది. ఇది టైటానియం గ్రేడ్‌ 4 ఫ్రేమ్‌, 10ఏటీఎం వాటర్‌ రెసిస్టెన్స్‌తో వస్తుంది. సముద్రంలో ఈత కొట్టడం నుండి అసాధారణమైన వాతావరణంలో సైక్లింగ్‌ చేయడం వంటి అధునాతన ఫిట్‌నెస్‌ అనుభవాల కోసం విస్తృత శ్రేణి ఆల్టిట్యుడ్‌ లో కూడా పనిచేయగలదు. (Story : శాంసంగ్‌ గెలాక్సీ వాచ్‌ 7, వాచ్‌ అల్ట్రా, బడ్స్‌ 3 సిరీస్‌ ప్రీ బుకింగ్స్‌ షురూ)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version