ఒమ్రాన్ హెల్త్‌కేర్ నెబులైజర్‌లపై ప్రచారం
న్యూస్‌తెలుగు/ముంబయి: ఒమ్రాన్ హెల్త్‌కేర్ కార్పొరేషన్ జపాన్ అనుబంధ సంస్థ, హోమ్ హెల్త్ మానిటరింగ్ పరికరాలను అందించటం ద్వారా ప్రసిద్ధి చెందిన ప్రముఖ సంస్థ, ఒమ్రాన్ హెల్త్‌కేర్ ఇండియా, సమర్థవంతమైన రీతిలో ఔషదాలు పనిచేయటం ద్వారా శ్వాసకోశ సమస్యలను అధిగమించటానికి, ముఖ్యంగా పిల్లలలో వ్యాధి నిర్వహణను మెరుగుపరచడానికి విస్తృత శ్రేణిలో నెబ లైజర్‌లను కలిగి ఉంది. ఊపిరితిత్తుల మందులను త్వరగా అందజేయడంలో ఖచ్చితత్వం కారణంగా, ఆస్తమా, సీఓపీడీ మొదలైన శ్వాసకోశ వ్యాధుల నిర్వహణలో ముఖ్యమైన పాత్రను నెబులైజర్‌లు పోషిస్తాయి. ఒమ్రాన్ హెల్త్‌కేర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ (ఎండి) తెసుయా యమాడా మాట్లాడుతూ, తీవ్రమైన వాయు కాలుష్యం, ఇతర కారణాల వల్ల దాదాపు 100 మిలియన్ల మంది శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్నారు. ముఖ్యంగా భారతదేశంలో మాత్రమే పెరుగుతున్న ఆస్తమా సంబంధిత మరణాల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. 1990లో, ఆస్తమాతో మరణించిన వారి సంఖ్య దాదాపు 150,000, కానీ ఇప్పుడు అది 200,000 దాటింది మరియు పెరుగుతూనే ఉందని అన్నారు. (Story : ఒమ్రాన్ హెల్త్‌కేర్ నెబులైజర్‌లపై ప్రచారం)