మత్స్య కళాశాలను సందర్శించిన ఎమ్మెల్యే
సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపడతామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే
న్యూస్‌తెలుగు/వనపర్తి : పెబ్బేరు మండల కేంద్రంలో గల మత్స్య కళాశాలను శుక్రవారం వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి గారు సందర్శించారు. కళాశాల అధ్యాపకులు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. తాగునీటి సమస్య డంపింగ్ యార్డ్, విద్యార్థులకు రాకపోకలకు సంబంధించి బస్ స్టాప్, కళాశాలకు రహదారి, స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేయించాలని అధ్యాపకులు ఎమ్మెల్యే ని కోరారు. అందుకు సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే కళాశాలకు సంబంధించిన సమస్యల పరిష్కారం కు సంబంధించిన ప్రతిపాదనలను తయారుచేసి ఇవ్వాలని సూచించారు
విద్యార్థులకు ఉద్యోగం కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి మత్స్య కళాశాలలో చదువుకున్న విద్యార్థులకు సైతం ఉద్యోగాలు వచ్చేలా చర్యలు తీసుకుంటామని ఆయన వారికి సూచించార అనంతరం కళాశాలలో ఏర్పాటుచేసిన చేపలు పెంపకం పాండ్స్ ను ఆయన సందర్శించి చేపల పెంపకం వివరాలు అడిగి తెలుసుకున్నారు
కార్యక్రమంలో పెబ్బేరు మండల కాంగ్రెస్ పార్టీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, భాను ప్రకాష్ రెడ్డి, రంజిత్ కుమార్, సురేందర్ గౌడ్, వెంకటేష్,రాజశేఖర్, వెంకటరమణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు