టి ఎస్ యు టి యఫ్ ఆధ్వర్యంలో సభ్యత్వనమోదు
న్యూస్ తెలుగు/నేరేడుచర్ల :తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ నేరేడుచర్ల మండల శాఖ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన టిఎస్ యుటిఎఫ్ సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ .అనిల్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే పెండింగ్ లో ఉన్న ఐదు డి ఏ లను మంజూరు చేయాలి పి.ఆర్.సి ని వెంటనే అమలు చేయాలి అలాగే సిపిఎస్ ని రద్దు చేసి 317 G.O ద్వారా ఉత్పన్నమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. లెఫ్ట్ ఓవర్ వేకెన్సీస్ ని త్వరగా ప్రమోషన్స్ ఇవ్వాలని పాఠశాలలో స్కావెంజర్స్ ని నియమించాలనిమొదలైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో నేరేడుచర్ల మండల శాఖ అధ్యక్షులు .కృష్ణయ్య సీనియర్ నాయకులు నరసింహ రావు వెంకటేశ్వరరావు వెంకటేశ్వర్లు వెంకట నర్సయ్య వెంకటేశ్వర్లు శ్రీనయ్య .యాదగిరి అక్కయ్య బాబు తదితరులు పాల్గొన్నారు. (Story : టి ఎస్ యు టి యఫ్ ఆధ్వర్యంలో సభ్యత్వనమోదు)