ఎలైట్ ప్రో బాస్కెట్‌బాల్ లీగ్ ప్రారంభం
న్యూస్‌తెలుగు/ హైదరాబాద్: యువ క్రీడాకారులను వెలికి తీయడమే లక్ష్యంగా కాలేజియేట్ స్లామ్ షోడౌన్ (సీఎస్‌ఎస్) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని డ్రీమ్ బాస్కెట్‌బాల్ అకాడమీలో ఎలైట్ ప్రో బాస్కెట్‌బాల్ లీగ్, ఎలైట్ ఉమెన్స్ ప్రో బాస్కెట్‌బాల్ లీగ్ ప్రారంభమైంది. దేశంలోని అత్యుత్తమ విశ్వవిద్యాలయాలు, కళాశాలల ప్రతిభను ఒకచోట చేర్చే వేదిక ఇది. ఈ ఈవెంట్ ఈనెల 21వ తేదీ వరకు జరగనుంది. పన్నెండు లక్షల రూపాయల ప్రైజ్ ఉంది. ఇందులో పురుష విజేతలకు ఆరు లక్షలు, మహిళా విజేతలకు ఆరు లక్షలు ఇవ్వనున్నారు. ఇండియాలోని నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ అంతటా ఒక నెల అంతా జోనల్ పోటీల తరువాత, ఫైనల్ షోడౌన్‌కు వేదిక సిద్ధమైంది. ఈ ఓపెన్ టోర్నమెంట్‌లో భారతీయ బాస్కెట్‌బాల్ కమ్యూనిటీ నుంచి అద్భుతమైన భాగస్వామ్యానికి సాక్ష్యమిచ్చింది. ఇది దేశవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలు, కళాశాల విద్యార్థుల అభిరుచి, నైపుణ్యాలను ప్రదర్శించింది. నేషనల్స్‌లో పురుషుల విభాగంలో ప్రతి జోన్ నుంచి ఛాంపియన్‌లు, రన్నరప్‌లు, మహిళల విభాగంలో ప్రతి జోన్ నుంచి ఛాంపియన్‌లు ఉంటారనిఎలైట్ ప్రో బాస్కెట్‌బాల్, ఎలైట్ ఉమెన్స్ ప్రో బాస్కెట్‌బాల్ లీగ్ సీఈవో సన్నీ భండార్కర్ తెలిపారు. (Story : ఎలైట్ ప్రో బాస్కెట్‌బాల్ లీగ్ ప్రారంభం)