ప్రజల జీవితాల్లో తొలి ఏకాదశి సకల శుభాలు కలిగించాలి
ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య
న్యూస్‌తెలుగు/ఎన్టీఆర్ జిల్లా, నందిగామ పట్టణం :
ముస్లిం సోదరులకు, హిందువులకు ఒకే రోజు కలిసి వచ్చిన రెండు విశేష పర్వదినాల సందర్భంగా నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
హిందువులకు ఎంతో ప్రత్యేకమైన తొలి ఏకాదశి పండుగ సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ, నియమనిష్టలతో ఉపవాస దీక్షలు చేస్తున్న భక్తులందరికీ ఆ భగవంతుడు ఆనంద, ఆరోగ్య, ఐశ్వర్యాలను ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. బుధవారం నందిగామ పట్టణంలో శ్రీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఎమ్మల్యే తంగిరాల సౌమ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆషాడ మాసం సందర్బంగా అమ్మవారికి బోనాల కార్యక్రమం నిర్వహించి, సారె సమర్పించారు.
సముద్రాల సురేష్ కళ్యాణి దంపతుల ఆధ్వర్యంలో తిరుమలకు 11 జంటలు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు, నందిగామ ఎమ్మెల్యే గా తంగిరాల సౌమ్య విజయం సాధించాలని కోరుతూ సముద్రాల సురేష్ కళ్యాణి దంపతుల మొక్కులు తీర్చుకునే కార్యక్రమంలో బుధవారం తిరుమలకు 11 జంటలు బయలుదేరారు. ఈ సందర్భంగా నందిగామ రథం సెంటర్ నుండి బయలుదేరిన వారి ప్రయాణం విజయవంతంగా పూర్తిచేసుకొని కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని రావాలని ఎమ్మెల్యే తంగిరా సౌమ్య వారికి అభినందనలు తెలియజేసారు.(Story : ప్రజల జీవితాల్లో తొలి ఏకాదశి సకల శుభాలు కలిగించాలి)