Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ ఇంజినీరింగ్‌ క్లాసుల ప్రారంభ తేదీ ఖరారైంది!

ఇంజినీరింగ్‌ క్లాసుల ప్రారంభ తేదీ ఖరారైంది!

0

ఇంజినీరింగ్‌ క్లాసుల ప్రారంభ తేదీ ఖరారైంది!

న్యూస్‌తెలుగు/అమరావతి: ఇంజినీరింగ్‌ ప్రవేశాలకు నిర్దేశించిన ఏపీ ఈఏపీసెట్‌ 2024 కౌన్సెలింగ్‌ ప్రక్రియలో భాగంగా బుధవారం తొలివిడత సీట్ల కేటాయింపును పూర్తి చేసినట్లు సాంకేతిక విద్యా శాఖ సంచాలకురాలు, ప్రవేశాల కన్వీనర్‌ డాక్టర్‌ బి.నవ్య తెలిపారు. ఈనెల 19 నుంచే తరగతులు ప్రారంభం అవుతాయని వివరించారు. అర్హత పొందిన 1,86,031 మందిలో తొలి విడత కౌన్సెలింగ్‌ కోసం 1,28,619 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా, ధ్రువీకరణ పత్రాల తనిఖీ అనంతరం 1,28,065 మంది అర్హత సాధించారన్నారు. కోర్సుల ఎంపికలను 1,26,608 మంది పూర్తి చేసుకోగా, 44,69,203 ఎంపికలు నమోదయ్యాయని వివరించారు. కన్వీనర్‌ కోటా కింద 24 విశ్వవిద్యాలయ ఇంజినీరింగ్‌ కళాశాలల్లో 6,877 సీట్లు ఉండగా, 6,189 సీట్లు భర్తీ అయ్యాయని తెలిపారు. 212 ప్రైవేట్‌ కళాశాలల్లో 1,21,951 సీట్లు ఉండగా, 1,03,247 భర్తీ అయ్యాయని, 9 ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో 7,832 సీట్లు ఉండగా, 7,700 సీట్లు భర్తీ చేసామని పేర్కొన్నారు. మొత్తంగా 245 కళాశాలల్లో 1,36,660 సీట్లు ఉండగా 1,17,136 సీట్లు భర్తీ అయ్యాయని, 19,524 సీట్లు మలివిడత కోసం ఉన్నాయని వివరించారు. ఎన్‌సీసీ సంచాలకులు, శాప్‌ ఎండీ నుంచి తుది మెరిట్‌ జాబితా రానందున క్రీడా కోటా, ఎన్‌సీసీ కోటా సీట్లను భర్తీ చేయలేదని కన్వీనర్‌ స్పష్టం చేశారు. (Story: ఇంజినీరింగ్‌ క్లాసుల ప్రారంభ తేదీ ఖరారైంది!)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version