చిట్యాల డబల్ బెడ్ రూమ్ కాలనీ వారి సమస్యలను పరిష్కరించాలి
న్యూస్‌తెలుగు/ వనపర్తి : చిట్యాల డబల్ బెడ్ రూమ్ కాలనీ వారి సమస్యలను పరిష్కరించాలని ఆదర్శ సంక్షేమ సేవా సంఘం అధ్యక్షులు గన్నోజ రవికుమార్ ,కార్యదర్శి వెంకటేశ్వర్లు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డా. జిల్లెల్ల చిన్నా రెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే తూడి మెగారెడ్డి
నాగర్ కర్నూలు పార్లమెంటు సభ్యులు ఎంపీ మల్లు రవి , జిల్లా కలెక్టర్
మున్సిపల్ చైర్మన్ జిల్లా అధికారులకు అందరికీ విజ్ఞప్తి చేశారు. చిట్యాల డబుల్ బెడ్ రూమ్ కాలనీలో అనేక సమస్యలు విలయ తాండం చేస్తూ ఉన్నాయి. ఈ డబల్ బెడ్ రూమ్ లో నివసించే వారికి అనేక ఇబ్బందులు గురవుతూ రోగాల పాలవుతున్నారు సరైన రోడ్లు లేవు వీధిలైట్లు లేవు డ్రైనేజీ కాలువలు లేవు బస్టాప్ లేదు ఈ ప్రాంతంలో అంగన్వాడి కేంద్రం లేదు రేషన్ డీలర్ షాపు లేదు ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లేదు ఇంకా ఎన్నో సమస్యలు విలయతాండవం చేస్తు ఉన్నవి కావున ప్రజా ప్రతినిధులు జిల్లా అధికారులు ఈ ప్రాంతాన్ని పరిశీలించి చిట్యాల డబల్ బెడ్ రూమ్ కాలనీ వారి సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. (Story : చిట్యాల డబల్ బెడ్ రూమ్ కాలనీ వారి సమస్యలను పరిష్కరించాలి)