కెనాన్ కొత్త తరం మోడల్స్ ఆవిష్కరణ
న్యూస్‌తెలుగు/ముంబయి: డిజిటల్ ఇమేజింగ్ సొల్యూ షన్స్‌లో అగ్రగామి సంస్థ కెనాన్ ఇండియా, తాజాగా తన ఈఓఎస్ ఆర్ సిరీస్‌కి రెండు ప్రత్యేక జోడిరపులను ఆవిష్కరించింది: ఈఓఎస్ ఆర్1 మరియు ఈఓఎస్ ఆర్5 మార్క్ 2. ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ విభాగంలో మార్గదర్శ కులుగా, కెనాన్ మళ్లీ పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చేందుకు, తన తదుపరి తరం తెలివైన ఫీచర్లు, నాణ్యత, వేగం, సౌలభ్యంతో వినియోగదారుని అంచనాలను అధిగమించేందుకు సిద్ధంగా ఉంది. ఈఓఎస్ ఆర్ 1 అనేది మీడియా, వీడియో ప్రొడక్షన్ డిపార్ట్‌మెంట్‌లతో పాటు తీవ్రమైన షూటింగ్ పరిస్థితుల్లోనూ నిర్ణయాత్మక క్షణాన్ని క్యాప్చర్ చేయాల్సిన యాక్షన్ జానర్ ఫోటోగ్రాఫర్‌లను లక్ష్యంగా చేసుకుని కంపెనీ విడుదల చేసిన మొదటి ఫ్లాగ్‌షిప్ ఈఓఎస్ ఆర్ సిస్టమ్ కెమెరా. ఇక ఈఓఎస్ ఆర్ 5 మార్క్ 2, పూర్తి-ఫ్రేమ్ మిర్రర్‌లెస్ కెమెరా. ఇది అత్యంత అధునాతనమైనది. (Story : కెనాన్ కొత్త తరం మోడల్స్ ఆవిష్కరణ)