ఆక్రమణలపై తహసీల్దార్ విచారణ
న్యూస్‌తెలుగు/ వేటపాలెం: మండల పరిధిలోని ఆక్రమణలపై ప్రజా సమస్యల పరిష్కార వేదిక లో జర్నలిస్టు యన్.నాగార్జున చేసిన ఫిర్యాదులపై వేటపాలెం తహసీల్దార్, రెవెన్యూ అధికారులు, వేటపాలెం దేశాయి పేట పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలు, మండల సచివాలయ సర్వేయర్లు సంయుక్తంగా మంగళవారం విచారణ చేపట్టారు. వేటపాలెం జంక్షన్ 216 జాతీయ రహదారి ప్రక్క కొండూరి ఆనందరాజు అతని అనుచరులు చట్టవిరుద్ధంగా సోనలను , డ్రైన్ పూడ్చి జాతీయ రహదారిని ఆక్రమించి అక్రమ నిర్మాణాలను చేపట్టారని, సోనలను, డ్రైన్లను పూడ్చడానికి చట్ట విరుద్ధంగా పెద్ద వాలు ప్రాంతంలోని రైతుల భూముల్లో అక్రమంగా సుమారు 100 ట్రాక్టర్లకు పైగా మట్టిని దౌర్జన్యంగా తవ్వి తరలించి సోనలు పూడ్చివేశారంటూ ఫిర్యాదుదారుడు ఆరోపణలపై ఆరోపణలపై తాహసిల్దార్ స్వయంగా పరిశీలించారు. మాజీ శాసనసభ్యుడు ఆమంచి కృష్ణమోహన్ జాతీయ రహదారిని ఆక్రమించి జంగిల్ కేఫ్ రెస్టారెంట్ పేరుతో షెడ్లు నిర్మాణం చేసి రోడ్డుకి ఇరువైపులా విద్యుత్తు స్తంభాలు ఫెన్సింగ్ వేసిన విషయమై ఎటువంటి చర్యలు చేపట్టలేదని ఫిర్యాదారుడు రెవెన్యూ అధికారులకు తెలిపారు. అనంతరం దేశాయి పేట, వేటపాలెం పంచాయతీల పరిధిలో స్మశానాలను కొంతమంది ప్రైవేటు వ్యక్తులు కులాల పేరుతో ఆక్రమించి భారత రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా శవాలకు కులాలను అంటగట్టి కులాల వారీగా స్మశాన భూములు ఆక్రమించి ప్రహరీ, ఫెన్సింగ్ వేశారని చేసిన ఆరోపణపై స్మశాన భూములను రెవెన్యూ అధికారులు పరిశీలించారు. అనంతరం 2019 సెప్టెంబర్ 14వ తేదీన రామచంద్రాపురం గ్రామసభలో అప్పటి జిల్లా జాయింట్ కలెక్టర్ షన్మోహన్ సామాజిక బహిష్కరణను సమర్థిస్తూ చేసిన ప్రకటనపై జర్నలిస్ట్ నాగార్జున చేసిన ఫిర్యాదు పై బాధితులను ఫిర్యాదుదారులను విచారించి బాధితుల వాదనను నమోదు చేసుకున్నారు. రామచంద్రపురం లో సామాజిక బహిష్కరణ కు గురైన మత్స్యకార బాధిత కుటుంబం కోడూరి రాజు, కోడూరు వెంకటేశ్వర్లు, కోడూరి పుష్ప విచారణలో పాల్గొన్నారు. (Story : ఆక్రమణలపై తహసీల్దార్ విచారణ)