అన్న క్యాంటీన్ల నిర్వహణకు రూ.1.30 లక్షల విరాళం
జిల్లా కలెక్టర్‌కు అందించిన ఎంఎల్ఏ అదితి గజపతిరాజు
న్యూస్‌తెలుగు/ విజయనగరం : పేదల ఆకలి తీర్చేందుకు ఆగస్టు 15 నుంచి పునఃప్రారంభం కానున్న అన్న క్యాంటీన్ల నిర్వహణకు రూ.లక్షా, 30వేల విరాళాన్ని, జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్‌కు, విజయనగరం ఎంఎల్ఏ పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు మంగళవారం అందజేశారు. తిలక్ ఫౌండేషన్ ప్రతినిధులు వెంకటేశ్వర ప్రసాద్ లక్ష రూపాయలను, కందాల సాయిబాబా, హైమావతి దంపతులు రూ.30వేలను సమకూర్చగా, ఎంఎల్ఏ చేతులమీదుగా కలెక్టర్ ఛాంబర్లో చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో దాతలు కూడా పాల్గొన్నారు. (Story : అన్న క్యాంటీన్ల నిర్వహణకు రూ.1.30 లక్షల విరాళం)