Home వార్తలు తెలంగాణ జూన్‌లో హైదరాబాద్‌లో రూ.4,288 కోట్ల ఇళ్ల రిజిస్ట్రేషన్లు

జూన్‌లో హైదరాబాద్‌లో రూ.4,288 కోట్ల ఇళ్ల రిజిస్ట్రేషన్లు

0

జూన్‌లో హైదరాబాద్‌లో రూ.4,288 కోట్ల ఇళ్ల రిజిస్ట్రేషన్లు

న్యూస్‌తెలుగు/ హైదరాబాద్‌: 2024 సంవత్సరం మొదటి అర్థభాగంలో జూన్‌ నెలలో హైదరాబాద్‌ రెండో అత్యధిక నెలవారీ రెసిడెన్షియల్‌ అమ్మకాలను నమోదు చేసింది. జూన్‌ నెలలో నగరంలో రూ.4,288 కోట్ల విలువైన గృహాల రిజిస్ట్రేషన్‌తో వార్షికంగా 48 శాతం, నెలవారీగా 14 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇక రిజిస్ట్రేషన్లు సంఖ్య 7,014 యూనిట్లతో వార్షికంగా 26 శాతం, నెలవారీగా 16 శాతం పెరిగాయని నైట్‌ఫ్రాంక్‌ ఇండియా తన తాజా నివేదికలో పేర్కొంది. హైదరాబాద్‌ రెసిడెన్షియల్‌ మార్కెట్‌ ప్రధానంగా హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి అనే నాలుగు జిల్లాలను కలిగివుంది. ఇది ప్రాథమిక, ద్వితీయ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌లకు సంబంధించిన గృహ విక్రయాలను కవర్‌ చేస్తుంది. జనవరి 2024 నుండి హైదరాబాద్‌లో 39,220 రెసిడెన్షియల్‌ ప్రాపర్టీల రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఇది 2023లో మొదటి ఆరు నెలలతో పోలిస్తే 15 శాతం పెరిగింది. జూన్‌ 2024లో రూ.50 లక్షల కంటే తక్కువ ధర కేటగిరీలో రిజిస్టర్‌ చేసిన ప్రాపర్టీలు హైదరాబాద్‌లో రిజిస్టర్‌ అయిన ఆస్తులలో అతిపెద్ద కేటగిరీగా ఉన్నాయి. అయితే విక్రయాల రిజిస్ట్రేషన్ల వాటా జూన్‌ 2023లో 70 శాతం నుండి జూన్‌ 2024లో 60 శాతానికి పడిపోయింది. రూ.1 కోటి, అంతకంటే ఎక్కువ ధర కలిగిన ఆస్తుల అమ్మకాల రిజిస్ట్రేషన్లు జూన్‌ 2024లో 14 శాతానికి పెరిగాయి. జూన్‌ 2024లో హైదరాబాద్‌లో అత్యధికంగా నమోదైన ఆస్తులు 1000 నుండి 2000 చదరపు అడుగుల పరిధిలో కేంద్రీకృతమై ఉన్నాయి. (Story :జూన్‌లో హైదరాబాద్‌లో రూ.4,288 కోట్ల ఇళ్ల రిజిస్ట్రేషన్లు)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version