మహిళలు స్వశక్తితో ఎదగాలి
డా.ఆర్.ఎస్.ప్రవీణ్
న్యూస్‌తెలుగు/ కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా :
మహిళలు స్వశక్తితో ఆర్థికంగా ఎదిగేందుకు కృషి చేయాలని భారాస నాయకులు డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ అన్నారు. సిర్పూర్ లో మహిళలకు స్వయం ఉపాధి కల్పన కోసం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మహిళలకు ఉచిత కుట్టుమిషన్, ఎంబ్రాయిడరీ, కంప్యూటర్ శిక్షణపై అవగాహన పెంచుకోవాలని అన్నారు.
ప్రభుత్వం ఇచ్చే పథకాలపై ఆధారపడకుండా మహిళలు స్వయం కృషితో తమ కాళ్లపై తాము నిలబడి ఆర్థికంగా ఎదిగి కుటుంబాన్ని పోషిస్తూ, ఇతరులకు ఉపాధి కల్పించే దిశగా అడుగులు వేయాలన్నారు.
చేతి వృత్తులతోపాటు,కుటీర పరిశ్రమల స్థాపనకై స్వయం ఉపాధి ఏర్పాటు చేసేలా మహిళకు నైపుణ్యం కల్పిస్తే ఆర్దికంగా బలోపేతమవుతారని అన్నారు.
చింతకుంట పంచాయితీ పరిధిలోని చుంచుపల్లిలో మిషన్ భగీరథ నీరు కలుషితమై కుళాయిలకు సరఫరా అవుతుందని, కలుషితమైన నీటితో ప్రజలు రోగాన భారిన పడుతున్నారని సంబంధిత ఇంజనీర్లతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని కోరారు. అనంతరం అసంపూర్తిగా మిగిలి ఉన్న ఆడ ప్రాజెక్ట్ కాల్వనుపరిశీలించారు.పార్టీలో చేరిన మహిళలకు కండువా కప్పి ఆహ్వానించారు. పార్టీ నాయకులు లెండుగురే శ్యాంరావు, ఆవుల రాజకుమార్,తదితరులు పాల్గొన్నారు. (Story : మహిళలు స్వశక్తితో ఎదగాలి)