UA-35385725-1 UA-35385725-1

బాధిత కుటుంబానికి ఆర్ధిక సాయం

బాధిత కుటుంబానికి ఆర్ధిక సాయం

లైంగిక దాడికి గురైన బాలికను పరామర్శించిన రాష్ట్ర ఎస్ టీ కమిషన్ చైర్మన్ డా డి వి జి శంకరరావు, జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు

న్యూస్‌తెలుగు/విజయనగరం: లైంగిక దాడికి గురైన బాలిక కుటుంబానికి ఆర్ధిక సహాయం అందించాలని ఎస్.టి కమిషన్ తరపున ప్రభుత్వానికి సిఫార్సు చేయనున్నట్లు రాష్ట్ర ఎస్ టీ కమిషన్ చైర్మన్ డా డి వి జి శంకర రావు తెలిపారు. రామభద్రపురంలో లైంగిక దాడికి గురై స్థానిక ఘోష ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారిని పరామర్శించే నిమిత్తం రాష్ట్ర ఎస్ టీ కమిషన్ చైర్మన్ డా డి వి జి శంకర రావు, జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాస రావు లు సోమవారం ఆసుపత్రిని సందర్శించి పసికందు ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. పాప ఆరోగ్యం బాగుందని, ఈ రోజు డిశ్చార్జ్బ్ చేస్తున్నామని వైద్యులు తెలిపారు. ఇంటివద్ద మెరుగయ్యే వరకు వైద్యం అందించాలని, ఐ సి డి ఎస్ శాఖ నుండి బాలిక పూర్తిగా కోలుకున్న వరకు పర్యవేక్షించాలని సూచించారు. అనంతరం మీడియా తో మాట్లాడుతూ పసికందు పై లైంగిక దాడి తో సభ్య సమాజం సిగ్గుపడుతోందని, నేరస్తుని వెంటనే పట్టుకున్నప్పటికీ శిక్షలు కఠినంగా ఉండాలని, అప్పుడే ఇలాంటి చర్యలు చేసేవారికి భయం కలుగుతుందని డా. శంకర రావు తెలిపారు. పొక్సో చట్టం క్రింద గత ఏడాది 34 వేల కేసు లు నమోదు కాగా ఇంకనూ 1లక్ష 30 వేల కేసు లు కోర్ట్ లలో పెండింగ్ ఉన్నాయని పేర్కొన్నారు. ఇటువంటి కేసుల విషయం లో సత్వర తీర్పులు, సత్వర శిక్షలు అమలు చేసేలా పోలీస్ లు, న్యాయస్థానాలు సహకరించాలని కోరారు. జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాస రావు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ తో చర్చించి జిల్లా పరిషత్ నుండి బాధిత కుటుంబానికి భరోసా నిచ్చేలా కొంత ఆర్ధిక సహాయాన్ని అందించడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా పొక్సో చట్టాన్ని కఠినంగా అమలు చేయవలసి ఉందని పేర్కొన్నారు. తక్షణ మెరుగైన వైద్యం అందించడం తో బాలిక కొలుకుందని , వారి కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర బాలల హక్కుల చైర్మన్ కేసలి అప్ప రావు, జిల్లా పరిషత్ 5వ కమిటీ ఛైర్పర్సన్ శాంతకుమారి, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా. భాస్కర రావు, ఐ సి డి ఎస్ పి డి శాంతకుమారి, ఘోష ఆసుపత్రి సూపరింటెండెంట్, గైనకలాజిస్ట్ డా.అరుణ శుభ శ్రీ, ఇతర వైద్యులు పాల్గొన్నారు. (Story: బాధిత కుటుంబానికి ఆర్ధిక సాయం)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
UA-35385725-1