ఇప్పుడు తిరుపతిలో 10 నిమిషాలలో బిగ్ బాస్కెట్ గ్రోసరీ డెలివరీ
న్యూస్‌తెలుగు/ తిరుపతి: టాటా వారి బిగ్ బాస్కెట్ తమ 10 నిమిషాల డెలివరీను ఇప్పుడు తిరుపతిలో ప్రారంభించింది. నగరంలో ఈ తరహా సేవలు అందుబాటులోకి రావటం ఇదే మొదటిసారి. బిగ్ బాస్కెట్ ఇప్పుడు తిరుపతి వాసులకు రోజువారీ నిత్యావసర వస్తువులను మెరుపు-వేగంతో కేవలం 10 నిమిషాలలో డెలివరీ చేయటం ద్వారా వినియోగదారులకు ఒక కొత్త అనుభూతిని అందిస్తోంది. నగరవాసులు ఇప్పుడు తాజా, గృహ సంబంధిత మరియు ఆహార పదార్థాలు మొదలగు 10000 పైగా ఉత్పత్తుల నుండి ఎంచుకోవచ్చు, ఇవి కేవలం 10 నిమిషాల్లో డెలివరీ చేయబడతాయి. అలాగే, మొదటి 10 డెలివరీలు ఉచితంగ అందిస్తుంది. కస్టమర్‌లు ప్లేస్టోర్, యాప్ స్టోర్ నుండి బిగ్బాస్కెట్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని సేవలను పొందవచ్చు. (Story : ఇప్పుడు తిరుపతిలో 10 నిమిషాలలో బిగ్ బాస్కెట్ గ్రోసరీ డెలివరీ )

