1000 కోట్ల మైల్ స్టోన్ చేరుకున్న కల్కి
న్యూస్‌తెలుగు/ సినిమాబ్యూరో : ప్రభాస్, అమితాబ్ బచ్చన్ ‘కల్కి 2898 AD’ మూడవ వారంలోకి ఎంటరై బాక్స్ ఆఫీస్ వద్ద అదరగొడుతోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్ల మైలురాయిని చేరుకుంది, సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.
బాహుబలి 2 తర్వాత ప్రభాస్ కు ఇప్పుడు రూ.1000 కోట్ల గ్లోబల్ క్లబ్‌లో రెండు సినిమాలు ఉన్నాయి. కల్కి 2898 AD సౌత్ ఇండియన్ సినిమాలలో నాన్-బాహుబలి 2 రికార్డ్‌ను బద్దలు కొట్టింది. ఈ సినిమా ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించగా, హిందీ బెల్ట్, ఇతర భాషలలో కూడా ఘన విజయాన్ని అందుకుంది.
ఈ చిత్రం నార్త్ అమెరికాలో $17 మిలియన్ల మార్కును దాటింది, ఇది ఇప్పటికే ఈ ప్రాంతంలో నాన్-బాహుబలి 2 రికార్డును బద్దలు కొట్టింది. కల్కి 2898 AD యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జర్మనీ, కెనడా, కొన్ని ఇతర దేశాలలో నాన్ -BB2 హిట్.
వైజయంతీ మూవీస్, కథ, కథనం, విజువల్స్, వరల్డ్ బిల్డింగ్, టెక్నికల్, ప్రొడక్షన్ స్టాండర్డ్స్ పరంగా వరల్డ్ క్లాస్ సినిమాతో వచ్చి ప్రేక్షకులు గుర్తుండిపోయే హిట్ ఇచ్చింది. యావత్ సినీ ప్రేక్షకులు హీరో ప్రభాస్, దర్శకుడు నాగ్ అశ్విన్, ఇతర టీమ్ సభ్యులను ప్రశంసిస్తున్నారు. (Story :1000 కోట్ల మైల్ స్టోన్ చేరుకున్న కల్కి)