శ్రీ చైతన్యలో వృక్ష సంరక్షణ కార్యక్రమం
న్యూస్ తెలుగు/విజయనగరం: భవిష్యత్తరాలకు మంచి ఆరోగ్యం ఆహ్లాదం ఆనందం కలగాలంటే విస్తృతంగా మొక్కలను నాటడమే ప్రస్తుత కాలంలో తక్షణ కర్తవ్యం అని శ్రీ చైతన్య పాఠశాల ప్రాంతీయ పర్యవేక్షకులు వి. శ్రీనివాసరావు అన్నారు. నేటి తరం విద్యార్థులకు తప్పనిసరిగా మొక్కల పెంపకంలో గల ఆవశ్యకతను తెలియజేయవలసిన బాధ్యత అందరిపై ఉన్నదని, ఈ దిశగా నేటి తరం విద్యార్థులను తీర్చిదిద్దవలసిన అవసరం ఎంతైనా ఉన్నదని పాఠశాల కోఆర్డినేటర్ వెంకటరమణ అన్నారు. పాఠశాల ఆవరణలో విద్యార్థినీ విద్యార్థుల చేత విస్తృతంగా మొక్కలను నాటించడం జరిగింది. వృక్షో రక్షతి రక్షితః మొదలైన నినాదాలుతో పాఠశాల విద్యార్థులచే ర్యాలీ నిర్వహించారు. మొక్కల ఆవశ్యకతను గూర్చి ప్రజలకు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీధర్ బాబు పాల్గొని విద్యార్థులకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో లాభదాయకమైనవని వివరించడం జరిగింది. పాఠశాల వృక్ష శాస్త్ర ఉపాధ్యాయులు. పాఠశాల డీన్ సూర్యచంద్ర, సత్యనారాయణ. ఐ.పి.యల్. చిన్ననాయుడు (సీ.బి.ఐ), ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. (Story: శ్రీ చైతన్యలో వృక్ష సంరక్షణ కార్యక్రమం)