నేడే చాట్రాయిలో ప్రజాసభ
ప్రజా సమస్యలే రామకోటయ్య ప్రధాన ఏజెండా….!
చాట్రాయి (న్యూస్‌తెలుగు) : స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న నూజివీడు మాజీ శాసనసభ్యులు చిన్నం రామకోటయ్య ప్రజా సభకు సర్వం సిద్ధం చేశారు. ఆదివారం సాయంత్రం( ఈరోజు) మండల కేంద్రమైన చాట్రాయి గ్రామంలోని ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద వెలగలపల్లి విస్సన్నపేట ప్రధాన రహదారి పక్కన ప్రజాసభకు భారీ ఎత్తున ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నడూ జరపని విధంగా సభ జరపడానికి భారీ ఏర్పాట్లు చేశారు. నూజివీడు శాసనసభా స్థానం నుండి రానున్న ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్న రామకోటయ్య సుమారు గత మూడు నెలల క్రితం స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని ప్రకటించిన దగ్గర నుండి ఊరూర తిరుగుతూ ఆత్మీయ సమ్మేళన సభలను ఏర్పాటు చేసి మంచి ప్రజాదరణను పొందుతున్నారు. ఈ నేపథ్యంలోనే మండల కేంద్రమైన చాట్రాయి గ్రామంలో ఎన్నడూ లేని విధంగా ప్రధాన రాజకీయ పార్టీలకు భిన్నంగా స్థానికంగా ఉన్న ప్రజా సమస్యలే ప్రధాన ఏజెండాగా ప్రజా సభకు సన్నద్ధం చేశారు. ప్రజాసభ ప్రభావం ఎలా ఉంటుందో అనేది చర్చనీయాంశంగా మారింది. (Story: నేడే చాట్రాయిలో ప్రజాసభ)
See Also:
రవితేజ బర్త్‌డే గిఫ్ట్ అదిరిపోయింది!
రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవల్!
‘సలార్ సీజ్ పైర్’ను మించి సలార్ పార్ట్ 2