Google search engine
Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌భార్యను కడతేర్చిన భర్త

భార్యను కడతేర్చిన భర్త

భార్యను కడతేర్చిన భర్త

పెనుగంచిప్రోలు : కుటుంబ తగాదాల నేపథ్యంలో ఆదివారం ఇంటి నుంచి వెళ్లిపోయిన దంపతులు..
సోమవారం వత్సవాయి మండలం భీమవరం సమీపంలోని జాతీయ రహదారి పక్కన ఉన్న కోనగిరి మల్లికార్జున స్వామి కొండపై శవమై కనిపించిన భార్య.. ప్లాన్ ప్రకారం కడ తేర్చిన భర్త..పోలీసుల అదుపులో నిందితుడు.. ఇలా వ‌రుస ఘ‌ట‌న‌లు పెనుగంచిప్రోలులో క‌ల‌క‌లం రేపాయి. వివరాలు లోకి వెళ్తే మండల కేంద్రం అయిన పెనుగంచిప్రోలు తుఫాన్ కాలనీకి చెందిన పద్మాల సురేష్, త్రివేణి దంపతులు గ‌త కొంత‌కాలంగా నివాసం ఉంటున్నారు. వీరికి పది సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. సురేష్ భవన నిర్మాణ పనులకు కూలిపని చేస్తూ జీవిస్తూ ఉన్నాడు. గత కొంతకాలంగా కుటుంబ కలహాలు చోటు చేసుకోవడంతో భార్యాభర్తలిద్దరూ గొడవలు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే శనివారం ఉదయం గుడికి వెళ్లి వస్తామని కుమారుడు, కుమార్తెతో చెప్పి దంపతులిద్దరూ ద్విచక్ర వాహనంపై బయటకు వెళ్లారు. రాత్రి అయినా రాకపోవటంతో పిల్లలు ఇద్దరు ఆందోళన చెందుతూ స్థానికంగా ఉన్న తాతయ్యకు చెప్పారు. బంధువులు ఇళ్ల‌కు ఫోన్ చేసి అడుగగా రాలేదు అని చెప్పారు. అనుమానించిన
వారు ఆదివారం రాత్రి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సోమవారం తెల్లవారుజామున భర్తను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా వత్సవాయి మండలంలోని కొంగర మల్లయ్య గట్టు వద్ద మల్లికార్జున స్వామి కొండపై నుంచి కిందకు తోసి హత్య చేసినట్లు తెలిపాడు. అతని సమాచారం మేరకు కొండపైకి చేరుకున్న పోలీసులు మృత‌దేహాన్ని కనుగొన్నారు. దీనిపై సంబంధిత కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా జగ్గయ్యపేట సర్కిల్ ఇన్‌స్పెక్ట‌ర్‌ జానకిరామ్ స్థానిక ఎస్ఐ. పి. రాంబాబు తెలిపారు. (Story: భార్యను కడతేర్చిన భర్త)

See Also: 

ర‌వితేజ బ‌ర్త్‌డే గిఫ్ట్‌ అదిరిపోయింది!

రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవ‌ల్‌!

స‌రైనోడు మూవీని మించిపోయేలా!

‘సలార్ సీజ్ పైర్’ను మించి సలార్ పార్ట్ 2

రెస్పాన్స్ బ‌ట్టి డెవిల్‌కు సీక్వెల్!

యూనిక్ కంటెంట్ ‘బబుల్‌గమ్’

ఇద్ద‌రు హీరోయిన్లు కావాలా నాయ‌నా? Eagleతో Hanuman సెటైర్లు!

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!